సమంతతో మావారు లవ్ లో ఉన్నారు.. ఏం చేయాలి?

0

సామాజిక మాధ్యమాల వేదికగా అక్కినేని ఆదర్శ దంపతులు నాగచైతన్య – సమంత ముచ్చట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ ముచ్చట్లలో అభిమానుల నుంచి పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సామ్ నాగచైతన్య స్పందించిన తీరు అసమానం. ఆన్సర్స్ అద్భుతం. ఎంతో ఫన్ జనరేట్ అయ్యే ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. అసలింతకీ ఈ అభిమానుల నుంచి ఎదురైన కొంటె ప్రశ్నలు ఎలా ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే..

ఆసక్తికరంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న లైవ్ లోనే వేడెక్కించింది. ఓ మహిళా వీరాభిమాని నాగచైతన్యతో మాట్లాడుతూ … మా ఆయన సమంతతో పిచ్చి గా ప్రేమలో ఉన్నారు. ఆయన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు అంతే సమయస్ఫూర్తితో రెస్పాండ్ అయిన చైతూ… ఓసారి మీ ఆయన్ని నా దగ్గరకు పంపించండి. తక్కువ టైమ్ లోనే సమస్యను పరిష్కరిస్తాను అని ఆన్సర్ చేశారు. ఏం చేస్తారేంటి? అని తిరిగి ప్రశ్నిస్తే.. కలిస్తే చెబుతానని అన్నారు.

ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడంలో అబ్బాయిలు మరీ అంత పరిపక్వత లేకుండా పూర్ గా ఎందుకు ఉంటారు? అన్న ప్రశ్నకు సమంత ఆన్సర్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు అదే సమస్యను ఒక్కొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకుంటారు. ఎవరికి వారు వారి విధానంలో స్పందిస్తారు అంతేనని అన్నారు. అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేయడమెలా ? అని ప్రశ్నిస్తే.. నిజాయితీగా ప్రపోజ్ చేయండని సమంత తెలిపారు. మొత్తానికి ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ని ఇచ్చారు ఈ అభినవ ప్రేమపక్షలు.
Please Read Disclaimer