ఆ రెండూ సినిమాలు కావు జ్ఞాపకాలు: చైతూ

0

విక్టరీ వెంకటేష్- నాగచైతన్య ఈ మామా అల్లుళ్లు కలిసి నటిస్తున్న చిత్రం `వెంకీమామ`. ఈ నెల 13న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న అక్కినేని- దగ్గుబాటి అభిమానుల సాక్షిగా నాగచైతన్య తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. తన జీవితంలో `మనం`-`వెంకీమామ` ఎంతో ముఖ్యమైన సినిమాలు అని అన్నారు. ఇవి నా దృష్టిలో సినిమాలు కాదు… జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు! అని అన్నారు నాగచైతన్య.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కెమెరా వెనకాల ఒక మామ (డి. సురేష్బాబు) కెమెరా ముందు ఒక మామ (వెంకటేష్) తనను చాలా బాగా చూసుకున్నారని.. రిలీజ్ తరువాత ఎలాంటి పేరొచ్చినా అది వారికే అంకితం చేస్తానని అన్నారు. ఇద్దరు మామలంటే నాకు చాలా ఇష్టం… అంటూ చైతూ తన మేన మామలపై తనకున్న ప్రేమను వ్యక్తం చేయడం అక్కినేని.. దగ్గుబాటి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

మామా అల్లుళ్ల తొలి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఓ రేంజ్లో వుండాలని.. బడ్జెట్ విషయంలో నిర్మాత సురేష్ బాబు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు మామలు ముద్దుల అల్లుడికి ఇస్తున్న స్వీట్ గిప్ట్ ఇది. అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని చైతూ కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా నిలుస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల 13 వరకు వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer