‘లవ్ స్టోరీ’లో నాగచైతన్య డాన్స్ మైనస్ కాబోతుందా..!

0

సాయిపల్లవి-నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం “లవ్ స్టోరీ”. క్లాస్ లవ్ మూవీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయిపల్లవి-నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ సినిమా పై భారీ అంచనాలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. “హే పిల్లా” అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

అయితే ఈ సినిమాలోని హీరోయిన్ సాయిపల్లవి టాలెంట్ గురించి అందరికి తెలిసిందే. ఆమె అద్భుతమైన నటనతో పాటు డాన్స్ కూడా ఇరగదీస్తోంది. ఈ సినిమాలోని పాటలకు సాయిపల్లవితో నాగచైతన్య డాన్స్ చేయలేకపోతున్నాడట. ఆమెతో స్టెప్స్ సీక్వెన్స్ లో వేయడానికి నాగచైతన్య 10-20 టేకులు తీసుకుంటున్నట్లు సమాచారం. సాయిపల్లవితో డాన్స్ స్టెప్పులు సింక్ చేయడం చైతు వల్ల కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

మరి రీసెంట్ గా విడుదలైన హే పిల్లా సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసింది. హరిచరణ్ ఆలపించిన ఈ పాటను సిహెచ్ పవన్ స్వరపరిచారు. అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్న ఈ పాట సినిమా విజయంలో కూడా భాగమవుతుందేమో చూడాలి. మరి నాగచైతన్య-శేఖర్ కమ్ముల హిట్లలో ఉన్నారు కాబట్టి అంచనాలు భారీగా ఉండటం లో తప్పులేదులెండి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-