చైతు కొత్త మేజిక్ చేస్తాడా

0

ఫిదా బ్లాక్ బస్టర్ కావడంలో శేఖర్ కమ్ముల భానుమతి పాత్రను తీర్చిదిద్దిన తీరు పక్కా తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు చాలా కీలక పాత్ర పోషించాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ స్లాంగ్ లో సినిమాలు రావడానికి ఫిదా మంచి ఊతంగా పని చేసింది. ఇప్పుడు అదే మేజిక్ శేఖర్ మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. లీకైన న్యూస్ మేరకు ఇటీవలే ప్రారంభమైన చైతు శేఖర్ కమ్ముల మూవీలో హీరో పాత్ర ఫక్తు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. అంటే ఎఫ్ 2లో వరుణ్ తేజ్ ఫిదాలో సాయి పల్లవిలాగా అన్నమాట.

చాలా క్లిష్టమైన పదాలను కూడా ఒరిజినాలిటీ మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. దీనికోసమే చైతు స్పెషల్ గా ట్యూటర్స్ సహాయంతో స్లాంగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్న చైతన్య టైం దొరికినప్పుడంతా దీని మీదే ప్రత్యక దృష్టి పెట్టినట్టు సమాచారం. హీరోయిన్ గా చేస్తున్న సాయి పల్లవితో వెరైటీగా వేరే కాన్సెప్ట్ ప్లాన్ చేశారట.

లవ్ స్టోరీలాగా సాగుతూనే విభిన్నమైన ఎమోషన్స్ తో పాటు డాన్స్ బ్యాక్ డ్రాప్ లో శేఖర్ కమ్ముల దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. క్రేజ్ ఉన్న కాంబినేషన్ కాబట్టి అన్ని సరిగ్గా కుదిరితే ఫిదాని మించిన సక్సెస్ కొట్టొచ్చన్న నమ్మకం టీమ్ లో ఉంది. మరి ఇరవై సినిమాల కెరీర్ లో మొదటిసారి స్లాంగ్ తో ఎక్స్ పరిమెంట్ చేస్తున్న చైతు ఫాన్స్ ఇది విన్నప్పటి నుంచి అంచనాలు పెంచుకోవడం ఖాయం.
Please Read Disclaimer