‘థ్యాంక్యూ’ అప్ డేట్ వచ్చేసింది

0

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న ‘థ్యాంక్యూ’ సినిమా అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే థ్యాంక్యూ మొదలు అవుతుందనే ప్రచారం జరిగింది. కాని శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని నాగచైతన్య ముగించి నెలలు గడుస్తున్నాయి. కాని ఇప్పటికి కొత్త సినిమాను చైతూ మొదలు పెట్టలేదు. కారణం ఏంటో కాని ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు మొదలు పెట్టేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. సినీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నుండి థ్యాంక్యూ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

విభిన్నమైన కథాంశాలతో స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తూ సినిమాలను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విక్రమ్ కుమార్ కు మంచి అనుభవం ఉంది. కథ రియాల్టీకి దూరం ఉన్నా కూడా ఆయన చూపించిన విధానం అందరికి నచ్చుతుంది. అందుకే మనంతో పాటు ఆయన చేసిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు థ్యాంక్యూను కూడా ఒక విభిన్నమైన నేపథ్యంలో రూపొందించేందుకు ఆయన రెడీ అయ్యాడంటూ సమాచారం అందుతోంది.

ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాలో నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ఎంపిక అయ్యింది. త్వరలోనే ఆ ఇద్దరు ముద్దుగుమ్మల ఎంపిక పూర్తి చేసి షూటింగ్ ను షురూ చేస్తారని టాక్ వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది దసరా వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.