పాత కాన్సెప్ట్ తో చైతూ కొత్త సినిమా

0

మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో మూడు ఏజ్ గ్రూప్స్ లో ప్రేమను చూపించిన విషయం తెల్సిందే. రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో కూడా వేరు వేరు వయస్సుల్లో ఒకే వ్యక్తికి సంబంధించిన ప్రేమను చూపిస్తారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో నాగచైతన్యతో దర్శకుడు విక్రమ్ కుమార్ ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

అక్కినేని కుటుంబంతో మనం చిత్రం చేసిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు విక్రమ్ చాలా దగ్గర అయ్యాడు. అక్కినేని హీరోలు కూడా ఈయనపై చాలా నమ్మకం పెట్టుకుంటున్నారు. అఖిల్ తో ఇప్పటికే సినిమా చేసిన విక్రమ్ ఇప్పుడు నాగచైతన్యతో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం లవ్ స్టోరీ ముగించే పనిలో ఉన్న నాగచైతన్య ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం పరశురామ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సి ఉన్నా కూడా అది క్యాన్సిల్ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ లైన్ కు ఇంప్రెస్ అయిన నాగచైతన్య లవ్ స్టోరీ విడుదల అయిన వెంటనే చేసేద్దాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నాగ చైతన్య ఇప్పటికే ప్రేమమ్ చిత్రంలో మూడు విభిన్నమైన ఏజ్ గ్రూప్స్ లో కనిపించి మెప్పించాడు. కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా విక్రమ్ కుమార్ మూవీలో కూడా మూడు ఏజ్ గ్రూప్స్ లో కనిపించి ఆకట్టుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-