25 ఏజ్ లో పరిచయం అయ్యాడు!

0

వెండితెర ప్రేమకథ కు ఏమాత్రం తక్కువ కాదు ఈ జంట ప్రేమకథ. సినిమా కలిపిన బంధమిది. ఏమాయ చేశావే సెట్స్ లో కలిసారు. అటుపై ప్రేమ లో పడ్డారు. అయితే ఆ ప్రేమ పండడానికి ఏడెనిమిదేళ్ల సమయం పట్టింది. అప్పటి కి చై వయసు 25 మాత్రమే. ఆ తర్వాత కెరీర్.. లవ్ రెండిటినీ పరుగులు పెట్టించారు. ఎవరికి వారు కెరీర్ పరంగా ఎదిగారు. ఆ క్రమంలోనే పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇందుకోసం ఇంట్లో ఒప్పించేందుకు నాగచైతన్య- సమంత ఇద్దరూ చాలానే ప్రయాస పడ్డారని కూడా పెళ్లికి ముందు ప్రచారమైంది. రెగ్యులర్ ప్రేమికుల కు ఉండే ఇబ్బందుల్ని ఈ ఇద్దరూ ఫేస్ చేశారని చెప్పుకున్నారు. బాల్కనీ నుంచి లీకైన ఫోటోలు సహా ప్రతిదీ ఈ ప్రేమ జంట వ్యవహారాలు ఫ్యాన్స్ ని వేడెక్కించాయి.

ఏమాయ చేశాడో ఏమో కానీ చైతూ సామ్ కి పిచ్చిగా నచ్చేశాడు. అయితే అప్పటి కి సమంత ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అమెరికా లో ఉన్న తన తల్లిగారికి ఫోన్ చేయాలంటే తన ఫోన్ లో బ్యాలెన్స్ లేదని .. చైతన్య ఫోన్ తీసుకుని కాల్ చేసేదానినని సామ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి షాకిచ్చారు. అందుకే సమంత లైఫ్ లో ప్రతి ఇన్సిడెంట్ లో చై సమ్మోహనం పని చేసిందని అభిమానుల కు అర్థమైంది. ప్రతి కష్టంలో సాయ పడేవాడే సిసలైన స్నేహితుడు. వెన్నంటి నిలిచేవాడే సిసలైన ప్రేమికుడు అని నిరూపించాడు.

టాలీవుడ్ లోనే ఐడియల్ కపుల్ గా మురిపిస్తున్నారు ఈ జంట. పెళ్లి తర్వాత.. పెళ్లికి ముందు చై-సామ్ జోడీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లైన తర్వాత మొదటిసారిగా నటించిన మజిలీ చిత్రం తో మరపురాని హిట్ అందుకున్నారు. ఓ బేబి రూపంలో సామ్ కి మరో బంపర్ హిట్ తగిలింది. 2019 నాగ చైతన్య- సమంత జోడీకి బాగా కలిసొచ్చిన సంవత్సరం. కెరీర్ పరంగా జెట్ స్పీడ్ అందుకున్న లక్కీ ఇయర్ అని చెప్పాలి. అందుకే నేడు చైతన్య 33వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భం గా సామ్ తనకు విషెస్ చెబుతూ చాలానే ఎమోషన్ అయ్యింది. చైకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ రేర్ ఫోటోని షేర్ చేసింది. ప్రతి నిమిషం నీ సంతోషం కోసం ప్రార్థిస్తాను. ఈ ఎదుగుదల కు గర్విస్తున్నా. ఎంతో స్ట్రాంగర్ గా ఉన్నావు ఇప్పుడు. ఐ లవ్ యు డార్లింగ్ హజ్ బెండ్! అంటూ సామ్ ఎమోషన్ అయ్యింది. ప్రస్తుతం చైతు మామ వెంకటేష్ తో కలిసి `వెంకీ మామ` చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి నాయిక. తాజాగా రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. వెంకీమామలో చైతూ గ్లింప్స్ ని నేడు రిలీజ్ చేయనున్నారు.
Please Read Disclaimer