సంక్రాంతి సినిమాలకు అశ్వథ్థామ వెరైటీ విషెస్

0

యువహీరో నాగశౌర్య త్వరలో ‘అశ్వథ్థామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన ‘అశ్వథ్థామ’లో నాగశౌర్య యాక్షన్ హీరో అవతారంలో కనిపిస్తున్నాడు. తాజాగా ‘అశ్వథ్థామ’ టీమ్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సంక్రాంతికి రానున్న సినిమాలకు శుభాకాంక్షలు తెలిపారు.

సంక్రాంతి కోడి పందేలు జరుగుతూ ఉంటే ఒక్కొక్కరు వచ్చి తమ కోడిని పందెంలో పాల్గొంటుందని నిర్వాహకులకు చెప్తూ ఉంటారు. దర్బార్ కోడి.. సరిలేరు నీకెవ్వరు కోడి.. అల వైకుంఠపురములో కోడి.. ఎంత మంచివాడవురా కోడి అన్నీ రెడీ అవుతాయి. అయితే దర్శకుడు రమణ తేజ ఉత్సాహంతో ‘అశ్వథ్థామ’ కోడి కూడా రెడీ అంటాడు. కానీ అసలే కాక మీద ఉన్న పందెంలో వేలు పెట్టడం మంచిది కాదని.. ఇలాంటి పోటీల్లో పాల్గొన కూడదని.. బయట నుంచి చూడాలని నాగశౌర్య సర్ది చెప్తాడు. దీంతో రమణతేజ పోటీని విరమించుకుంటాడు.

ఫైనల్ గా సంక్రాంతి సినిమాలకు ‘అశ్వథ్థామ’ టీమ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కుతోంది. ఒకవైపు సంక్రాంతి సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్తూనే తమ సినిమాకు కూడా కల్పించుకుంటున్నారని ‘అశ్వథ్థామ’ టీమ్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Please Read Disclaimer