ఆ హీరో ఆవకాయ పచ్చడైతే సరిగ్గా కలుపుతాడా..?

0

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. భూకంపం వచ్చినా కనబడని ఆందోళనలు కరోనా మూలన కళ్ళముందు కనబడుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరోనా ఎఫెక్ట్ దేశంలో ఏ విధంగా ఉందో.. ఆ కరోనా పరిస్థితిని అరికట్టడానికి రాష్ట్రాలన్నీ పూనుకొని జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చాయి. ప్రస్తుతం జనాలతో పాటు సినిమా ఫ్యామిలీలు కూడా ఈ కర్ఫ్యూలో పాల్గొని ఇంట్లోనే ఉంటున్నారు. సినీ ఇండస్ట్రీ వాళ్లంతా సోషల్ మీడియాలో అభిమానులతో తమ డైలీ రోటీన్స్ – హాబీస్ గురించి పంచుతూ ఉన్నారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో మాత్రం వెరైటీగా ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో నేర్చుకున్నాడట.

ఆ హీరో ఎవరో కాదు నాగశౌర్య. రీసెంట్ గా అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకులను పలరించి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కొన్ని సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇంటికే పరిమితమైన నాగశౌర్య. వాళ్ళ అమ్మతో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టాడట. తను పచ్చడి కలపడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ కూడా నాగశౌర్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లో కూర్చొని పచ్చళ్ళు బాగానే కలుపుతున్నావ్.. కానీ హిట్ సినిమాలు తీయడం మాత్రం నీవల్ల కావట్లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే సినిమాలు కుదిరే పని కాదని ఈ పని పెట్టుకున్నాడేమో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిట్లు ఎలాగో కొట్టట్లేవ్ కనీసం పచ్చడైన సరిగ్గా కలుపు శౌర్యా.. అని మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. చూడాలి మరి మీమ్స్ రాయుళ్లకు హిట్ కొట్టి సమాధానము చెప్తాడేమో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-