మెగా ఆశీస్సులతో అశ్వథ్థామ హిట్టు కొడతాడా?

0

మెగాస్టార్ చిరంజీవి అందరివాడుగా మారి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అపసవ్య దిశలో వెళుతున్న మూవీ ఆర్టిస్టుల సంఘా(మా)న్ని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్రమశిక్షణా సంఘం పెద్దగా ఆయన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. మరోవైపు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా తానున్నానన్న సంకేతాల్ని చిరంజీవి ఇస్తున్నారు. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు అనంతరం ఎవరూ లేరు అనుకుంటున్న సమయంలో మెగాస్టార్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో ఇండస్ట్రీలో చిరు ఇన్వాల్వ్ మెంట్ అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇండస్ట్రీలో చిన్నా చితకా అనే తేడా లేకుండా అందరికీ ఆయన అందుబాటులో ఉంటున్నారు. యువ హీరోల అభ్యర్థన మేరకు వారి సినిమాలకు ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎందరో యువహీరోలు చిరు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మొన్న ఓ వేదికపై కార్తికేయ లాంటి హీరో మేమంతా మీ బిడ్డలమేనంటూ విధేయతను చాటుకున్నాడు. ఇలా ఎందరో హీరోలు చిరు బ్లెస్సింగ్స్ కోసం ఆరాటపడుతున్నారు.

నవతరంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న నాగశౌర్య అందుకు మినహాయింపేమీ కాదు. ఇతర హీరోల్లానే తాను కూడా చిరు విధేయుడిగా అభిమానిగా ఆయన ఆశీస్సులు అందుకున్నారు. శౌర్య నటించిన అశ్వథ్థామ జనవరి 31న విడుదలవుతోంది. రిలీజ్ కి మరో రోజు మాత్రమే ఉంది కాబట్టి.. ఇప్పటికే చిత్రబృందం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. శౌర్య తో పాటు తన మదర్ కూడా చిరుతో దిగిన ఈ ఫోటోలో ఉన్నారు. అశ్వథ్థామ తొలి రిపోర్ట్ రేపటి సాయంత్రం విదేశాల నుంచి వెలువడుతుంది. అటుపై మరుసటి రోజు ఉదయం రివ్యూలు వచ్చేస్తాయి. ఛలో రిలీజ్ సమయంలోనూ శౌర్యకి చిరు ఆశీస్సులు అందించారు. ఆ సినిమా పెద్ద సక్సెసైంది. అదే సెంటిమెంటు ఫలించి రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుందేమో చూడాల్సిందే.
Please Read Disclaimer