కుర్ర హీరో రైటర్ గా సక్సెస్ అందుకుంటాడా?

0

సినిమా ప్రేక్షకుల్లో మార్పు వచ్చేసింది. పాత కథలతో సినిమాలు చూడ్డానికి ఏ మాత్రం ఇష్ట పడట్లేదు. కొత్త కథలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త టీం అయినా కలెక్షన్ల రూపంలో అభినందనలు అందిస్తున్నారు. అయితే అలాంటి కొత్త కథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అంటున్నాడు నాగ శౌర్య.

అవును ‘అశ్వత్థామ’ సినిమాతో రైటర్ అవతారమెత్తాడు శౌర్య. మూడేళ్ళ క్రితం మహిళలపై జరుగుతున్న హత్యాచారాలపై తన మదిలో మెదిలిన ఓ పాయింట్ మీద వర్క్ చేసి సినిమా కథ సిద్దం చేసుకున్నాడు దాన్ని రమణ తేజ అనే డైరెక్టర్ చేతిలో పెట్టి అతని ఓ చాన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాను ఓన్ చేసుకున్న శౌర్య ఇప్పటికే ఇది తనకి చాలా స్పెషల్ ఫిలిం అని చెప్పుకుంటున్నాడు. పైగా శరీరంపై ఓ టాటూ కూడా వేయించుకున్నాడు.

నిజానికి ఓ హీరో డైరెక్టర్ అవ్వడం ప్రొడ్యూసర్ అవ్వడం కామనే ఇలా ఎందరినో చూసాం. కానీ ఎవరూ ఊహించని విధంగా హటాత్తుగా రైటర్ గా మారి ఓ ప్రయత్నం చేస్తున్నాడు శౌర్య. ఈ సినిమా ఫలితం మీదే తన రైటింగ్ టాలెంట్ ఆధారపది ఉందని సినిమా హిట్టయితే నా కథలు మిగతా హీరోలు వినడానికి స్కోప్ ఉంటుందని అంటున్నాడు. మరి ఈ కుర్ర హీరో రైటర్ గా ఏ మాత్రం సక్సెస్ అందుకుంటాడో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.
Please Read Disclaimer