యూత్ హీరో సినిమాకు సూపర్ డీల్!

0

గత ఏడాది ఛలోతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో నాగ శౌర్యకు ఆ తర్వాత రెండు మూడు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పటికీ కథ నచ్చి చేసిన ఓ బేబీ మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా అతను నటిస్తున్న అశ్వద్ధామ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కారణం యూనిట్ చెబుతున్న సమాచారం మేరకు శాటిలైట్ డీల్ క్లోజ్ కావడమే. అక్షరాలా 3 కోట్ల 15 లక్షల దాకా డీల్ కుదిరిందని వినికిడి. ఇది ఏ యాంగిల్ లో చూసినా భారీ మొత్తమే.

అశ్వద్ధామకు సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. టీజర్ గురించి అడగడానికి లేదు. పోనీ వర్కింగ్ స్టిల్స్ అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అయినా కూడా అశ్వద్ధామకు ఇలాంటి ఆఫర్ రావడం అంటే బంపర్ ఆఫర్ కిందే చెప్పొచ్చు. సినిమాను నిర్మిస్తున్న ఐరా సంస్థ మాత్రం ఏ ఛానల్ తీసుకుందో బయట పెట్టడం లేదు. జెమిని లేదా స్టార్ మా ఈ రెండింటిలో ఒకటని ఇన్ సైడ్ న్యూస్.

భీకరమైన మార్కెట్ లేకపోయినా నాగ శౌర్య సినిమాకు ఇంత రేట్ రావడాన్ని బట్టి చూస్తే యూత్ లో ఫామిలీస్ ఉన్న సాఫ్ట్ కార్నర్ అర్థమవుతోంది. ఇంకా రిలీజ్ డేట్ సెట్ కానీ అశ్వద్ధామ ఈ ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం ఉంది. దీని షూటింగ్ లోనే నాగ శౌర్య గాయాల పాలై కొంత రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అశ్వద్ధామ పూర్తికాగానే రాఘవేంద్రరావు గారు ముగ్గురు దర్శకులతో ఒకే సినిమాలో పొందుపరిచే మూడు ప్రేమకథలో సినిమాలో జాయిన్ అవుతాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది
Please Read Disclaimer