శౌర్య సినిమా ఆగిపోయిందా ?

0

గత ఏడాది ఛలోతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాగశౌర్యకు ఆ తర్వాత రెండు మూడు బ్రేకులు పడ్డప్పటికి కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకవైపు హీరోగా తనకు సూటయ్యే కథలతో పాటు క్యారెక్టర్ ప్రాధాన్యతను బట్టి హీరొయిన్ ఓరియంటెడ్ మూవీస్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. సమంతా టైటిల్ రోల్ పోషిస్తున్న ఓ బేబీలో చేస్తోంది అందుకే.

ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన భవ్య క్రియేషన్స్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు ఫిలిం నగర్ టాక్. దీని ద్వారా రాజ కొలుసు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. కాని ఇది ఇక ముందు వెళ్ళే ఛాన్స్ లేదని వినికిడి. హీరోకు నిర్మాతకు ఏవో అంతర్గత విభేదాల వల్ల ఆగిపోయినట్టు సదరు గాసిప్స్ సమాచారం

ఇప్పుడా దర్శకుడు రాజా అదే సబ్జెక్టుని వేరే బ్యానర్ లో రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వినికిడి. నాగశౌర్యకు ఆ కథ మీద ఆసక్తి పోవడంతో వేరే ఆప్షన్ ఎంచుకోబోతున్నట్టుగా చెబుతున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన జగపతిబాబు ఆయనకు ఇద్దరు చాయల్లో ఈ మూవీ ఉండొచ్చని షూటింగ్ టైంలోనే లీక్ వచ్చింది.

మరి అభిప్రాయభేదాలు వచ్చాయి అంటే కథ విషయంలోనా లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అధికారికంగా ధృవీకరణ రావడానికి ఇంకొంత టైం పట్టొచ్చు. భవ్య లాంటి పెద్ద బ్యానర్ లో ఛాన్స్ మిస్ అవ్వడం అంటే రాజా లాంటి డెబ్యు డైరెక్టర్ కి కొంత ఇబ్బంది కలిగించే విషయమే
Please Read Disclaimer