ఆ సీన్ సామ్ రెండోసారి చేద్దామందట!

0

కథకు అనుగుణంగా కొన్ని ఇబ్బందికర సన్నివేశాల్ని చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో కొందరు ప్రముఖు నటులు చూపించే చుక్కలు అన్నిఇన్ని కావు. తానెంత ఇబ్బంది పడినా.. సీన్ సరిగా వచ్చేందుకు ఎలాంటి ఈగోలు చూపించకుండా రెండోసారి చేద్దామని చెప్పే వారు అరుదుగా ఉంటారు. రీల్ మీద చూసినంతనే ఇలాంటి సీన్ చేయటానికి సమంత ఒప్పుకుందా? అనిపించే సీన్ ను చిత్రీకరించే సమయంలో జరిగిన విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

సినిమాల విషయంలో సామ్ కమిట్ మెంట్ ఎంతలా ఉంటుందో చెప్పే ఈ ఉదంతం గురించి బయటపెట్టారు నాగశౌర్య. తాజాగా అతగాడు నటించిన ఓ బేబీ చిత్రంలో సమంతతో జత కట్టటం తెలిసిందే. తొలుత అతిధి పాత్ర అనుకున్నా.. తర్వాత ఆ పాత్ర నిడివిని పెంచారు. ఇదిలా ఉంటే..ఈ సినిమా ప్రొమోల్ని చూసినోళ్లకు ఒక సన్నివేశం చూసినంతనే ఒక సీన్ ఇట్టే ఆకర్షిస్తుంది. సమంత మాటకు నీళ్లు తాగుతున్న నాగశౌర్య నవ్వు ఆపుకోలేక తాగుతున్న నోట్లో నీటిని ఒక్కసారిగా సమంత ముఖం మీద పడే సన్నివేశం ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఉమ్ము పడినట్లే.

మరి.. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో జరిగిన ఆసక్తికర అంశాన్ని చెప్పారు నాగశౌర్య. ఈ ఇబ్బందికర సీన్ ను ఒక్క షాట్ లోనే ఓకే చేద్దామని అనుకున్నారట.

అదే రీతిలో మొదటి షాట్ లోనే సీన్ ఓకే అయ్యిందట. అయితే.. ఆ సన్నివేశాన్ని మరింత సహజంగా ఉండాలనే తపనతో సమంత రెండోసారి చేద్దామని ఆడిగినట్లుగా నాగశౌర్య చెప్పారు. సన్నివేశం సరిగా వచ్చేందుకు సమంత ఎంతగా తపిస్తారో ఇదొక్క ఉదాహరణ చాలన్నారు.షూటింగ్ సమయంలో సమంత తనను ఎంతగానో ప్రోత్సహించినట్లుగా నాగశౌర్య చెప్పారు. ఏమైనా ఒక అగ్రనటి.. ఇబ్బందికర సీన్ ను.. కమిట్ మెంట్ తో చేయటం మాత్రం గ్రేట్ అని చెప్పక తప్పదు.
Please Read Disclaimer