సందీప్ కిషన్ సినిమా నాగ శౌర్య చేతికి?

0

గతేడాది సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా తెరకెక్కించిన సంతోష్ జాగర్లపూడి తో తన నెక్స్ట్ సినిమా అంటూ అనౌన్స్ చేసాడు సందీప్ కిషన్. వీళ్ళిద్దరి సినిమాకు క్రికెట్ నేపథ్యంతో ఉండే కథను ఎంచుకున్నారు. కొన్ని రోజులు సందీప్ -సంతోష్ మధ్య డిస్కర్షన్ కూడా నడిచింది. కట్ చేస్తే సంతోష్ జాగర్లపూడి నాగశౌర్యతో సినిమా ఒకే చేసుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజే లాంచ్ అయింది.

ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాలో చేయబోతునట్లు మేకర్స్ అఫీషియల్ ప్రకటించారు. ఇలా ప్రకటించగానే ఇది సందీప్ కిషన్ తో చేయాల్సిన కథేనన్న విషయంపై క్లారిటీ వచ్చింది. పైకి క్రికెట్ అని చెప్పకుండా స్పోర్ట్స్ డ్రామా అంటూ కవరింగ్ ఇచ్చారంతే. నిజానికి సందీప్ కిషన్ కి ఇది కొత్తేం కాదు. రామ్ -అనుపమ జంటగా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమ కోసమే’ కథ కూడా ముందు సందీప్ దగ్గరికే వెళ్ళింది. ఆ తర్వాత దిల్ రాజు ఎంటరై హీరోగా రామ్ ను తీసుకొని కథలో మార్పులు చేయించాడనే టాక్ ఉంది.

ఇక నాగ శౌర్య కి కూడా ఇది కొత్త కాదు. నాగ చైతన్య చేయాల్సిన కథతో ఇటివలే సినిమాను స్టార్ట్ చేసాడు. ఆ సినిమాతో సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతుంది. సో తన కథతో మరో సినిమా చేయడం అటు సందీప్ కి వేరే హీరో కోసం సిద్దమైన కథను తను చేయడం ఇటు నాగ శౌర్య కి ఇద్దరికీ కొత్తేం కాదు.
Please Read Disclaimer