సైరా.. బ్రదర్ కు చాలా పెద్ద కోరికే ఉందే!

0

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్దమయ్యింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరియు ఆసక్తి మరింతగా పెరిగాయి. తాజాగా ఈ చిత్రం గురించి మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

తాజాగా జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో నాగబాబు కనిపించలేదు. ఆ విషయమై చర్చ జరుగుతున్న సమయంలో నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోను విడుదల చేశాడు. తాను విదేశాల్లో ఉన్న కారణంగా అన్నయ్య పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనలేదని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఇక అన్నయ్య చిరంజీవి సైరా చిత్రం గురించి మాట్లాడుతూ ఈసారి జాతీయ అవార్డు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.

నాగబాబు మాట్లాడుతూ.. ‘రుద్రవీణ’ చిత్రానికే అన్నయ్యకు జాతీయ అవార్డు రావాల్సింది. కాని ఆ సమయంలో ఇవ్వలేదు. కనీసం ఈసారి సైరా కైనా జాతీయ అవార్డు వస్తుందని ఆశిస్తున్నట్లుగా నాగబాబు చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం కోసం అన్నయ్య చిరంజీవి చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టంకు ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉందని నాగబాబు అన్నాడు. అన్నయ్య చిరంజీవికి జాతీయ అవార్డు రావాలనే నాగబాబు కోరిక తీరేనా చూడాలి.
Please Read Disclaimer