పొరుగు దేశంపై ఫైర్ అయిన నాగబాబు…!

0

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో అడుగుపెట్టిన తర్వాత ఎంత యాక్టీవ్ గా ఉంటున్నాడో అందరికి తెలిసిందే. రాజకీయ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. కొన్ని సార్లు వివాదాస్పద ట్వీట్స్ తో విమర్శలకు గురవుతూ వస్తున్నాడు. అటు యూట్యూబ్ లో ‘నా ఛానల్ నా ఇష్టం’ అంటూ వీడియోలు పోస్టు చేస్తూ ఇటు ట్విట్టర్ లో ట్వీటకుడి అవతారమెత్తారు. గాంధీని చంపిన గాడ్సేను గొప్ప దేశభక్తుడంటూ పొగడటం.. కరెన్సీ నోట్లపై బొమ్మపై కామెంట్స్ చేయడం ఇలా ఆయన వేసే ట్వీట్లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.. విమర్శలకు గురయ్యాయి.. కేసులు పెట్టే వరకు కూడా వెళ్లాయి.

మొన్న ”భారతీయుల రక్తం శాంతి అహింస మంత్రాలతో చల్లబడిపోయింది. తిరిగి రక్తం వేడెక్కలంటే ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ సింగ్ అశోక చక్రవర్తి సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్ శ్రీకృష్ణ దేవరాయలు రాజ రాజ చోళుడు సముద్రగుప్తుడు మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ అయినా సాహసం పౌరుషం మరిగే రక్తం తో పెరుగుతారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది. వాళ్ళనన్నా దేశానికి ఉపయోగపడే వీరులుగా తయారు చేద్దాం. భారత దేశానికి దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి. డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు గుండాలు మాఫియా ఫ్యాక్షన్ గుండా రాజకీయ నాయకులు కుహనా ఉదారవాదులు ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్ మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని” అంటూ ట్వీట్ చేసాడు.

నిన్న ‘మనల్ని గొప్పోడు గొప్పోడు అంటే ఉబ్బి తబ్బిబ్బు అయిపోకండి.. సమయం చూసి ఒక్క నొక్కు నొక్కుతారు’ అంటూ అరుణాచలం సినిమాలోని రజినీకాంత్ చెప్పిన డైలాగ్ ట్వీట్ చేసాడు. ఈ రోజు మన పొరుగుదేశం చైనా ఆగడాలపై ట్విట్టర్ లో ఫైర్ అయ్యాడు నాగబాబు. ”మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువుల్ని సెల్ ఫోన్ యాప్స్ ని బహిష్కరిద్దాం. మన దేశంలో తయారైన వస్తువులని కొందాం. ప్రపంచంలో మన దేశం పెద్ద మార్కెట్. అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటే మన దేశమే లాభపడుతుంది. తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనందరం బాగుపడతాం. మన డబ్బు మన దేశంలోనే వుంటుంది మనమే బాగుపడదాం. అంతే కాని మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువుల్ని బ్యాన్ చేద్దామ్” అంటూ #beindianbuyindian #banchinaproducts #banchinaapps హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్వీట్ చేశాడు నాగబాబు.

గత కొన్ని రోజులుగా పొరుగు దేశం చైనా మన దేశంపై కవ్వింపు చర్యలకు పాలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు చైనా వస్తువుల వాడకం తగ్గించమని చెప్పుకొచ్చారు. దీనిపై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా కొంతమంది నెటిజన్స్ మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ మీ మెగా ఫ్యామిలీ సభ్యులు టిక్ టాక్ యాప్స్ యూస్ చేస్తున్నారు. వారిని ఫస్ట్ తీసేయమని చెప్పు.. ఆ తర్వాత అందరికి సలహా ఇవ్వొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ముందు తెలుగు సినిమాల్లో ఇక్కడి నటుల్ని లోకల్ సాంకేతిక నిపుణుల్ని వాడండి.. తర్వాత చైనా వస్తువులని బ్యాన్ చేయమని చెప్పండి.. ఈ చైనా నుండి ఇంపోర్ట్స్ ఎక్సపోర్ట్స్ ఆపేయమని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయమని అడుగు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Please Read Disclaimer