వాళ్ల దేవుడే కరోనాను పంపించాడు: నాగబాబు

0

కరోనా కరోనా.. ఇప్పుడు ఈ వైరస్ అంటే ప్రపంచం భయపడుతోంది. తెలుగు రాష్ట్రాలకు సైతం పాకిన ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మరణాలు సంభవించాయి. దేశంలోనూ ఇద్దరు చనిపోయారు.

చైనాలో పుట్టిన కరోనాను చూసి మొదట్లో మన సోషల్ మీడియా లో ఒకటే జోకులు మీమ్స్ సెటైర్లు పడ్డాయి. కరోనాను చూసి నవ్వి జోకులు పేల్చిన వారు ఇప్పుడు వాటికే బలి అయిన పరిస్థితిని చూస్తున్నాం. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం అందరికీ ఫోన్లు చేస్తుంటే దానిపైన కూడా సెటైర్లు వేసిన వైనాన్ని చూశాం. ఇక ఈ దగ్గు మీద దేశంలో ఎన్నో మీమ్స్ సెటైర్లు జోకులు సోషల్ మీడియాలో పడ్డాయి.

తాజాగా కరోనాపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ హాట్ ట్వీట్ సంధించారు. కాస్త వెటకారంగా నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ట్విట్టర్ వేదికగా నాగబాబు కరోనాపై తాజాగా పోస్టు పెట్టారు.

‘కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కరోన వైరస్ ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీద కి పంపించాడు అని అంటున్నారు.అయినా ఈ దేవుళ్ళ కి కోపం ఎక్కువే సుమా..’ అంటూ వ్యంగ్యంగా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కరోనాపై నాగబాబు చేసిన ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘వాళ్ళేగా గురు..! గోమూత్రం వాడితే ఆ వైరస్ చనిపోతుంట సుమా’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

ఏదీ ఏమైనా కరోనాపై నాగబాబు చేసిన సెటైర్ ట్వీట్.. దానికి ప్రతిస్పందనగా నెటిజన్ల స్పందన తో సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ సాగుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-