నాకు బాగైంది.. మీరు జాగ్రత్త : నాగార్జున

0

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో వైరల్ ఫీవర్స్ ఇంకా డెంగ్యూ ఫీవర్స్ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరంలో ఈ సీజన్ లో ఈ పరిస్థితి కనిపిస్తూనే ఉంటుంది. కాని ఈసారి మాత్రం మరీ ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ అంటోంది. గత కొన్ని రోజులుగా జ్వరాలు మరియు డెంగ్యూ వల్ల ఇబ్బంది పడుతున్న వారు వేల నుండి లక్షలకు చేరుతున్నారు. దాంతో మంత్రి కేటీఆర్ ఇంట్లో ఎక్కడ కూడా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు చుట్టు పక్కల పిచ్చి మొక్కలు మరియు క్లీన్ గా లేని ఏరియాలు ఉంటే తమ వంతుగా ముందుకు వచ్చి క్లీన్ చేసుకోవాలంటూ పిలుపునిచ్చాడు.

ఎవరి ఇంట్లో వారు.. ఎవరికి వారు క్లీనింగ్ చేసుకోవాలంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు పలువురు సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా నాగార్జున కూడా ఈ విషయమై స్పందించారు. తన ఇంట్లో మరియు అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడ నీటి నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ అంతా సాఫీగా ఉండేలా చూశానంటూ ట్వీట్ చేశాడు. నేను ఇప్పుడిప్పుడే వైరల్ ఫీవర్ నుండి రికవర్ అవుతున్నాను. ఆ సమయంలో నాకు బాడీ పెయిన్స్ విపరీతంగా ఇబ్బంది పెట్టాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా దోమల నుండి జాగ్రత్త పడండి.

నేను మా వారికి అంతా నీట్ గా క్లీన్ గా ఉండాలని సూచించాను. మీరు కూడా మీ ఇంటిని ఇంకా చుట్టు పక్కల పరిసరాలను నీట్ గా పెట్టుకోండి అంటూ నాగార్జున రిక్వెస్ట్ చేశాడు. మాన్ సూన్ ఫీవర్ అనే హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ ను ట్యాగ్ కేసి నాగార్జున ఈ ట్వీట్ చేయడం జరిగింది. నాగార్జున వైరల్ ఫీవర్ నుండి పూర్తిగా క్యూర్ అయినట్లుగానే అనిపిస్తున్నారు. తనలా ఇతరులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో ఇలా పరిసరాలను క్లీన్ గా ఉంచుకోండి అంటూ సూచన చేశాడు.
Please Read Disclaimer