60 ఏళ్ల వయసులో కూడా అలాంటి సినిమాలే చేస్తానంటున్న సీనియర్ హీరో…?

0

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ‘కింగ్’ నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. తనయులు నాగ చైతన్య – అఖిల్ లు హీరోలుగా రాణిస్తుంటే.. వారికి పోటీగా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. ఇటు సిల్వర్ స్క్రీన్ మీద ‘కింగ్’ అనిపించుకున్న నాగ్ స్మాల్ స్క్రీన్ మీద కూడా తన హవా చూపిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అక్కినేని నాగార్జునకు సరైన సక్సెస్ లేదు. నిజం చెప్పాలంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘ఊపిరి’ సినిమాల తర్వాత నాగ్ కి కమర్షియల్ హిట్ అనేదే లేదు. నాగ్ ఎంతో ఇష్టపడి చేసిన ‘మన్మథుడు 2’ డిజాస్టర్ అయ్యింది. ‘మన్మథుడు’ సినిమా నాగార్జునకు ఎంత మంచి పేరు తెచ్చిందో.. ‘మన్మథుడు 2’ అంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. దీంతో నాగ్ కి అర్జెంటుగా ఓ మంచి హిట్ సినిమా అవసరం ఉంది. ఈ నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుగునున్న ఈ సినిమాతో ‘ఊపిరి’కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన సోలొమాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీంతో పాటు ‘బ్రహ్మాస్త్ర’ అనే బాలీవుడ్ సినిమాలో అమితాబ్ – రణబీర్ కపూర్ – అలియాభట్ లతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోయే మరో సినిమా కూడా ఓకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. ‘చందమామ కథలు’ ‘PSV గరుడవేగ’ లాంటి మంచి హిట్ చిత్రాల్ని డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు తో నాగార్జున సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా నాగార్జున ఇమేజ్ కి తగిన స్క్రిప్ట్ ని ప్రవీణ్ సత్తారు సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ నాగార్జునకు నేరేట్ చెయ్యడం.. నాగ్ ఓకే చేయడం కూడా జరిగిపోయిందట. ఈ సినిమాలో నాగార్జున మిలిటరీ మరియు రా ఆఫీసర్ గా రిటైర్ అయి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా భాద్యతలు నిర్వర్తించే పాత్రలో కనిపించబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం మీద నాగ్ 60 ఏళ్ళ వయసులో కూడా యాక్షన్ థ్రిల్లర్ స్టోరీస్ ఎంచుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
Please Read Disclaimer