బిగ్ బాస్ 3 సస్పెన్స్ కు ఫుల్ స్టాప్

0

గత కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 వార్తలు మీడియాను ముంచెత్తుతున్నాయి. ఒక వైపు హోస్ట్ ఎవరంటూ వార్తలు మరో వైపు పార్టిసిపెంట్స్ గురించిన వార్తలు. పార్టిసిపెంట్స్ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు కాని హోస్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. స్టార్ మాటీవీ వారు బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరనే విషయంపై క్లారిటీ ఇస్తూ అఫిషియల్ వీడియోను విడుదల చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే నాగార్జున మూడవ సీజన్ ను హోస్ట్ చేయబోతున్నాడు.

ఒక మార్కెట్ లో నాగార్జున తిరుగుతూ బిగ్ బాస్ హౌస్ కు కావాల్సిన వస్తువులు కొనడంను వీడియోలో చూపించారు. అయినా మీరు వచ్చారేంటి సర్ అంటూ షాపు వ్యక్తి ప్రశ్నించగా.. ‘ఈ సారి నేనే రంగంలోకి దిగుతున్నా’ అంటూ నాగార్జున సమాధానం చెప్పి బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ తానేనంటూ చెప్పేశాడు. 14 మంది పార్టిసిపెంట్స్ 100 రోజుల పాటు షో జరుగబోతున్నట్లుగా కూడా ఈ వీడియోలో నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు.

మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా రెండవ సీజన్ కు నాని హోస్ట్ లు గా వ్యవహరించారు. రెండు సీజన్ లు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి. ఇప్పుడు మూడవ సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహించి హోస్టింగ్ లో అనుభంను దక్కించుకున్న నాగార్జున ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 3 ని విజయంతంగా నడపగలడని అంతా భావిస్తున్నారు. జులై రెండవ వారంలో మూడవ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. అయితే వారు ఎవరనే విషయం సీజన్ ప్రారంభం అయిన మొదటి ఎపిసోడ్ లో తెలియబోతుంది.
Please Read Disclaimer