బిగ్ బాస్ కాంట్రవర్సీపై నాగ్ తెలివైన రియాక్షన్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభంకు ముందే వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. షోలో పార్టిసిపేట్ చేసేందుకు అంటూ కొందరు తమను సంప్రదించి అసభ్యంగా ప్రవర్తించారు అంటూ గాయత్రి గుప్తా మరియు శ్వేతారెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో మహిళ కమీషన్ ను కూడా వీరిద్దరు కలిశారు. దాంతో ఈ వివాదం చాలా పెద్దగా మారింది. ఈ విషయమై ఓయూ స్టూడెంట్ జేఏసీ కూడా నాగార్జున ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇంత వివాదం జరుగుతున్నా కూడా నాగార్జున మాత్రం పెద్దగా స్పందించలేదు. తాజాగా మన్మధుడు 2 చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ బిగ్ బాస్ 3 గురించి స్పందించాడు.

ఈ సందర్బంగా నాగ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో నాకు సంతృప్తిగా ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు చేసే సమయంలో ఒకే చోట బిగుసుకుని కూర్చోవాల్సి ఉండేది. కాని ఇక్కడ మాత్రం చాలా కూల్ గా అటు ఇటు తిరుగుతూ.. అనుకున్నది చేస్తూ హోస్టింగ్ చేసే అవకాశం ఉంది. ఇక కాంట్రవర్సీల గురించి నేనెప్పుడు పట్టించుకోలేదు. ఈ విషయాల గురించి కూడా నేనేం స్పందించదల్చుకోలేదు. బిగ్ బాస్ అనేది 15 దేశాల్లో ఉంది. మన ఇండియాలో హిందీలో 12 సీజన్ లు పూర్తి చేసుకుని వివిధ భాషల్లో కూడా ప్రసారం అవుతుంది. పుకార్లు… కాంట్రవర్సీలు అనేవి గాల్లోంచి కూడా పుడతాయి.

బిగ్ బాస్ 3 కాంట్రవర్సీ గురించి నాకు తెలియదు. ఈ వివాదంమై తెలంగాణ పోలీసులు మరియు కోర్టు విచారణ చేయడం ఆనందంగా ఉంది. ఎవరైనా తప్పు చేస్తే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని నమ్ముతున్నాను అంటూ నాగార్జున తెలివిగా ఈ కాంట్రవర్సీ గురించి ఎక్కువగా మాట్లాడకుండా తప్పించుకున్నారు. ఇక పార్టిసిపెంట్స్ ఎంపిక విషయం చివరి వరకు నాకు తెలియదు అని.. షో ప్రారంభంకు కొద్ది సమయం ముందు నాకు తెలిసిందని నాగార్జున చెప్పుకొచ్చాడు.

నాగ్ మన్మధుడు 2 చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటించింది.. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Please Read Disclaimer