‘మన్మధుడు 2’ బడ్జెట్ ఎంత?

0

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం `మన్మధుడు 2`. రకుల్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నాగార్జున- జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు.. టీజర్ .. లిరికల్ సాంగ్స్ కి చక్కని స్పందన వచ్చింది. నాగార్జున ఘాటైన రొమాన్స్ గురించి యూత్ లో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే.. గీతాంజలి ఏజ్ అంటూ కింగ్ జోరు చూపిస్తున్నారు. రొమాన్స్ లో అప్పటితో పోలిస్తే ఇంకా అనుభవం పెరిగిందని సమర్థించుకున్నారు.

ఏదైతేనేం.. `మన్మధుడు 2` ప్రీరిలీజ్ బిజినెస్ కి ఇవన్నీ కలిసొచ్చాయనే చెప్పొచ్చు. ఇప్పటికే మన్మధుడు 2 శాటిలైట్.. హిందీ డబ్బింగ్ రైట్స్.. డిజిటల్ రూపంలో 22 కోట్ల మేర నాన్ థియేట్రికల్ బిజినెస్ సాగింది. థియేట్రికల్ బిజినెస్ పెద్ద రేంజులోనే జరుగుతోందట. తాజాగా బడ్జెట్ కి సంబంధించిన టాప్ సీక్రెట్ రివీలైంది. ఇంతకీ ఎంత బడ్జెట్ పెట్టారు? అంటే..

ఈ సినిమాకి దాదాపు 24 కోట్ల బడ్జెట్ ఖర్చయ్యింది. నాగార్జున పారితోషికం మినహా ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టారట. అయితే ఇప్పటికే ఈ మొత్తం నాన్ థియేట్రికల్ రూపంలోనే ఆర్జించారు. ఇక థియేట్రికల్ బిజినెస్ రూపంలో అంతకుమించి దక్కనుంది. ఆగస్టు 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer