మన్మధుడు సీక్వెల్ కాదనేసిన కింగ్

0

కింగ్ నాగార్జున కథానాయకుడిగా విజయ భాస్కర్ తెరకెక్కించిన `మన్మధుడు` 2002లో రిలీజైంది. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత మన్మధుడు 2 తెరకెక్కుతోంది. మన్మధుడు చక్కని రొమాంటిక్ కామెడీ సినిమా. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దడంలో విజయభాస్కర్ పెద్ద సక్సెసయ్యారు. ఆ చిత్రానికి కామెడీ.. రొమాన్స్.. లవ్.. ఎమోషన్ .. పంచ్ ఇలా అన్నీ ఎంతో గొప్పగా కుదిరాయి. అందుకే ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే కింగ్ నాగార్జున నేటి ట్రైలర్ లాంచ్ వేడుకలో మీడియాతో మాట్లాడుతూ షాకిచ్చే విషయం చెప్పారు. అసలు పదిహేడేళ్ల నాటి మన్మధుడితో తాజా చిత్రానికి పోలికలు ఉంటాయా? అని మీడియా అడిగిన ప్రశ్నకు నాగార్జున ఆన్సర్ సర్ ప్రైజ్ చేసింది. అసలు మన్మధుడుతో కథ పరంగా ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. పంచ్ లు వినోదం తప్ప తాజా చిత్రానికి ఎలాంటి పోలిక లేదు. సేమ్ అదే తరహా కామెడీ జోనర్.. ఇందులో నేను లీడ్ గా చేస్తున్నాననేదే కామన్ పాయింట్ అని తెలిపారు. మన్మధుడు కథకు.. క్యారెక్టర్ కి ఎక్కడా సంబంధం ఉండదని నాగార్జున స్పష్టంగా తెలిపారు. అప్పట్లో మన్మధుడు సరదాగా చేసేశాం. విజయ్ భాస్కర్ తో షూటింగ్ బాగా జరిగింది. `మన్మధుడు 2` కూడా ఆ సినిమాకి సమానంగానే ట్రీటిస్తుంది! అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మన్మధుడు 2లో సమంత పాత్ర ఎలాంటిది అన్నది రివీల్ చేయలేనని అన్నారు. సమంతతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. తనతో ఇప్పటికే మనం- రాజు గారి గది 2 సినిమాలు చేశాను. తను కోడలైన తర్వాత మరింత కేర్ తీసుకుంటున్నాను అని తెలిపారు.

వయాకామ్ 18 సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని నాగార్జున వెల్లడించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి బెస్ట్ ట్యాక్స్ పేయర్ పురస్కారాన్ని అందుకున్నానని తెలిపారు. ఆగస్టు 9న వస్తున్న మన్మధుడు చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆనందించమని కోరారు.
Please Read Disclaimer