నాగార్జున గేమ్…మిత్రులు – శత్రువులని తేల్చేశారు…

0

బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఇంటి సభ్యులకి మిత్రులు – శత్రువులు – వెన్నుపోటుదారులో ఎవరో చెప్పే గేమ్ పెట్టి ఎపిసోడ్ ని ఆసక్తికరంగా మార్చేశారు. మొదట ఇంటి సభ్యులతో మాట్లాడినా నాగార్జున బాబా భాస్కర్ కు క్లాస్ పీకారు. ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుంటే పెద్ద మనిషిగా ఉన్న బాబా ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. అలాగే దానికి బాబా కామెడిగా సమాధానం చెబుతుంటే ‘ఇది కామెడీ కాదు సీరియస్ అంటూ నాగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అలీ ఎలిమినేషన్ కు నామినేట్ చేసినప్పుడు బాబా ఏడవటం బాధనిపించిందని చెప్పారు.

ఆ తర్వాత అలీ టాలెంట్ షో లో బాగా నటించాడని మెచ్చుకుంటూనే – హౌస్ లో ఎందుకు అగ్రిసివ్ గా ఉంటున్నావని చురకలు వేశారు. ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా? అంత అహంకారం ఎందుకు? అని ప్రశ్నించారు. అలాగే మహేశ్ విషయంలో కూడా అలీ వ్యవహరించిన తీరుపైన క్లాస్ పీకారు. ఇక బాబా – అలీకి క్లాస్ పీకడం అయిపోయాక నాగ్ ఇంటి సభ్యులకు మిత్రులు – శత్రువులు – వెన్నుపోటుదారులు ఎవరో చెప్పాలని – వారి ఫోటోలని బోర్డు మీద పెట్టాలని చెప్పి గేమ్ మొదలుపెట్టారు. దీంతో మొదటిగా పునర్నవి లేచి రాహుల్ (మిత్రుడు) – శత్రువు (వరుణ్ సందేశ్) – వితికా (వెన్నుపోటు) అంటూ బోర్డు మీద వారి ఫోటోలని పెట్టింది.

ఇక తర్వాత హిమజ.. శ్రీముఖి (మిత్రుడు) – వితికా (శత్రువు) – అషురెడ్డి (వెన్నుపోటు) లని పెట్టగా – మహేష్ విట్టా.. బాబా భాస్కర్ (మిత్రుడు) – అలీ రజా (శత్రువు) – వెన్నుపోటు (శ్రీముఖి) ఫోటోలని పెట్టాడు. అలాగే వితికా.. పునర్నవి (మిత్రుడు) – హిమజ (శత్రువు) – రవిక్రిష్ణ (వెన్నుపోటు) లని సెలెక్ట్ చేసింది. రాహుల్.. పునర్నవి (మిత్రుడు) – హిమజ (శత్రువు) – రవిక్రిష్ణ (వెన్నుపోటు) ఫోటోలని బోర్డు మీద పెట్టాడు. అషురెడ్డి.. శివజ్యోతి (మిత్రుడు) – బాబా భాస్కర్ (శత్రువు) – హిమజ (వెన్నుపోటు) లని పెట్టగా – శ్రీముఖి.. రాహుల్ (మిత్రుడు) – బాబా భాస్కర్ (శత్రువు) – వితికా – పునర్నవి (వెన్నుపోటు)లని పెట్టింది.

ఆ తర్వాత వరుణ్ సందేశ్.. మహేష్ (మిత్రుడు) – వితికా (శత్రువు) – పునర్నవి (వెన్నుపోటు) – శివజ్యోతి.. అషు (మిత్రుడు) – మహేష్ (శత్రువు) – బాబా భాస్కర్ (వెన్నుపోటు) – బాబా భాస్కర్.. శ్రీముఖి (మిత్రుడు) – అలీ మహేష్ (వెన్నుపోటు) ఫోటోలని పెట్టి శత్రువు ఎవరూ లేరని చెప్పారు. రవిక్రిష్ణ.. శివజ్యోతి (మిత్రుడు) – అలీ (శత్రువు) – వితికా (వెన్నుపోటు) – అలీ రజా.. శివజ్యోతి (మిత్రుడు) – రవిక్రిష్ణ (శత్రువు) – హిమజ (వెన్నుపోటు) ల ఫోటోలు పెట్టాడు.

ఇక ఎలిమినేషన్ విషయానికొస్తే ఈవారం శివజ్యోతి – మహేశ్ – శ్రీముఖి – బాబా భాస్కర్ – అషు – రాహుల్ – పునర్నవి లు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. దీంట్లో మహేశ్ – శివజ్యోతిలు సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించగా – ఆదివారం నలుగురుని సేఫ్ చేసి ఒకరిని బయటకి పంపనున్నారు.
Please Read Disclaimer