మళ్లీ నాగార్జున ఎంటరయ్యాడు.. అఖిల్ సినిమా నిలుస్తుందా..?

0

ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు వాసు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుస ప్లాపులలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే అనే కసితో కన్పిస్తున్నారు హీరో అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్. వరుస పరాజయాల పాలు అయినప్పటికీ వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా కుదిరిందబ్బా..అని అందరు ముక్కున వేలేసుకున్నారు. కానీ భాస్కర్ తెచ్చిన కథలో చాలా దమ్ముందని అందుకే గట్టి నమ్మకంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలుపుతున్నారు.

తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ లోకి కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఎడిటింగ్ లోపాలతోనే ఇంతకుముందు అఖిల్ సినిమాలన్నీ బోల్తా పడ్డాయని ఆయన భావించారేమో.. అందుకే సీన్ లోకి ఎంటరై ఉంటాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్. అయితే ఇంతకు ముందు నాగార్జున దగ్గరుండి కేర్ తీసుకున్న సినిమాలు కూడా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. మరి ఈసారి ఏం జరగనుందో.. అని అనుకుంటున్నారు. కానీ నాగార్జున మాత్రం ఎడిటింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రఫ్ కట్స్ అన్ని చూసి దర్శకునికి ఎడిటింగ్ టీంకి కొన్ని సూచనలు సూచించారట. మరి అవుట్ ఫుట్ మాత్రం పాసిటివ్ కావాలని కుర్చున్నారంట నాగార్జున.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-