నాగార్జున వల్లే స్టార్ మా టాప్ 3 ప్లేస్!

0

దేశంలోనే పాపులర్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ జాబితాలో తెలుగు ఛానెల్ స్టార్ మా మూడవ స్థానంలో నిలిచినట్లుగా ఆ ఛానల్ యాజమాన్యం ప్రకటించింది. బీహార్ కు చెందిన దంగల్ టీవీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలువగా రెండవ స్థానంలో తమిళనాడుకు చెందిన సన్ టీవీ ఉంది. మూడవ స్థానంలో తెలుగు స్టార్ మా నిలిచింది. గతంలో టాప్ 10 లో ఆ తర్వాత టాప్ 5 లో ఉన్న స్టార్ మా ఇప్పుడు బిగ్ బాస్ 3 కారణంగా టాప్ 3 లోకి వచ్చిందని అంటున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ని కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తుండటం వల్లే స్టార్ మా ఛానెల్ కు ఇంత పాపులారిటీ వచ్చిందని.. ఇందుకు ప్రధాన కారణం నాగార్జున గారి హోస్టింగ్ అంటూ ఛానెల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒక తెలుగు ఛానెల్ జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలవడం చాలా గొప్ప విషయం అని బిగ్ బాస్ కు వచ్చిన 1108 గ్రాస్ రేటింగ్ పాయింట్స్ కారణంగానే ఈ స్థానం దక్కిందని వారు చెబుతున్నారు.

బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడవ సీజన్ కు పలువురు పేర్లు వినిపించినా నాగార్జునను బలవంతంగా ఒప్పించి మరీ ఈ షోను చేయిస్తున్నారట. నాగార్జున బలవంతంగా ఒప్పుకున్నా కూడా తన పూర్తి అఫర్ట్ పెట్టి షో ను నిర్వహిస్తున్నారు అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. కొందరు నాగార్జున షో ను ఫాలో అవ్వకుండానే హోస్టింగ్ చేస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయినా కూడా షోకు మాత్రం మంచి పాపులారిటీ వచ్చింది.

ఆరంభంలో రికార్డు స్థాయి రేటింగ్ వచ్చింది. మద్యలో కాస్త డల్ అయ్యింది. సీజన్ ముగింపు దశకు చేరుకున్న ఈ నేపథ్యంలో మళ్లీ మంచి రేటింగ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ 3వ తేదీతో బిగ్ బాస్ సీజన్ 3 కి ఎండ్ కార్డ్ పడబోతుంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న అయిదుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home