విమానంలో అప్సెట్ అయిన నాగార్జున!

0

టాలీవుడ్ లో సూపర్ కూల్ గా ఉండే స్టార్ హీరోలలో కింగ్ నాగార్జున ఒకరు. ప్రమోషన్స్ సమయంలో కానీ ఇతర కార్యక్రమాలకు హాజరైనప్ప్పుడు కానీ నాగ్ మొహంలో చిరునవ్వు చెరిగిపోదు. ‘ఆఫీసర్’ లాంటి ఫ్లాప్స్ ఎదురైనప్పుడు కూడా నాగ్ కూల్ గా వెకేషన్ లో తన లైఫ్ ను తను ఎంజాయ్ చేశారంటేనే ఆయన ఎంత కూల్ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటిది నాగ్ ఈరోజు అప్సెట్ అయ్యారని.. కోపం వచ్చిందని సమాచారం.

నాగార్జున గత కొన్నిరోజులుగా తన కుటుంబంతో కలిసి గోవాలో వెకేషన్ లో ఉన్నారు. ఈరోజు ఏదో పని మీద గోవా నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారట. విమానంలో ఉన్న సమయం కొందరు అభిమానులు ఎగ్జైట్ అయ్యి నాగార్జునను కాస్త విసిగించారట. దీంతో అప్సెట్ అయిన నాగ్ అక్కడ ఉన్న స్టాఫ్ కు చెప్పి తన సీట్ వేరే చోటికి మార్పించుకున్నారట. దీంతో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కొందరు స్టార్లకు కాస్త కోపం వస్తేచాలు మహాత్మా గాంధీ ఫిలాసఫీకి పూర్తిగా రివర్స్ లో అభిమానులకు రెండు చెంపలు ఎడాపెడా వాయిస్తారు. అలాంటివి ఇప్పుడు న్యూస్ గా మారడం లేదు. ఎందుకంటే అవి కామన్ అయ్యాయి. కానీ నాగ్ లాంటి కూల్ పర్సన్ ఇలా సీట్ మార్పించుకోవడం మాత్రం విడ్డూరమే అంటున్నారు.

ఏదేమైనా అభిమానులు కూడా సెలబ్రిటీలను వేధించడం మానుకోవాలి. వారికి ప్రైవసీ అవసరం అనే విషయం గుర్తెరిగి నడచుకోవాలి. అక్కడ నాగార్జున ఉన్నారు కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా ఘాటు స్టార్ అయితే సదరు అభిమానుల సీట్ చిరిగిపోయి ఉండేది. ఆ దెబ్బకు వారే “మేము సీటు మార్పించుకుంటాం భగవంతుడా” అని మొత్తుకునేవారు!
Please Read Disclaimer