మన్మధుడు 2: కొబ్బరికాయ కొట్టారోచ్..!

0

‘దేవదాస్’ తర్వాత కింగ్ నాగార్జున హిందీలో ‘బ్రహ్మస్త్ర’.. తమిళంలో ధనుష్ సినిమాలోనూ నటిస్తున్నాడు. తెలుగులో ‘మన్మధుడు’ సీక్వెల్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి కదా.. ఈరోజే ఆ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచ్ చేశారు. ఫిలిం యూనిట్ సభ్యులతో పాటుగా నాగార్జున సతీమణి అమల.. నాగ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముహూర్తం షాట్ కు అమల క్లాప్ కొట్టగా నాగ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. నాగార్జున సరసన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. సుశాంత్ హీరోగా నటించిన ‘చిలసౌ’ చిత్రంతో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లను తెరకెక్కించగలనని నిరూపించుకున్న రాహుల్ కు ఇది భారీ అవకాశమే. అంతే కాకుండా రాహుల్ కు ఇదో ఛాలెంజ్ అని కూడా చెప్పవచ్చు. నాగార్జున కెరీర్లో ‘మన్మధుడు’ సినిమాను క్లాసిక్ గా చాలామంది అభివర్ణిస్తుంటారు. అలాంటిది రైటర్ త్రివిక్రమ్- డైరెక్టర్ విజయ భాస్కర్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేయడం కష్టమైన విషయమే. మరిఎంతవరకూ ఆ ఫీట్ ను సాధించగలడో వేచి చూడాలి.

ఎం.సుకుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘RX100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మనం ఎంటర్ ప్రైజెస్..ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై నాగార్జున.. పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరోప్ లో ప్రారంభిస్తారని సమాచారం.
Please Read Disclaimer