కింగ్ కెరీర్ బెస్ట్ డిజిటల్ రికార్డ్

0

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా సినిమా `మన్మధుడు 2`. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 9న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున- జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత.. కీర్తి సురేష్ అతిధి పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించాక ప్రచారంలోనూ టీమ్ వేగం పెంచింది.

ఇదివరకూ రిలీజైన`మన్మధుడు 2` టీజర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమాలో కింగ్ రొమాన్స్ పీక్స్ లో చూపిస్తున్నారని అర్థమైంది. లేటు వయసు బ్రహ్మచారిగా నాగ్ బోలెడంత కామెడీ పండించబోతున్నారు. `ఏజ్ బార్ బ్రహ్మచారి సీక్రెట్ రొమాన్స్` అన్న పాయింట్ యూత్ కి కనెక్టయ్యింది. రొమాన్స్ కాస్త శ్రుతి మించినా.. సినిమా ఆద్యంతం ఫన్నీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచారని టీజర్ రివీల్ చేసింది. ఈ సినిమా నుంచి వరుసగా ఒక్కో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేస్తూ ప్రచారం వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాటల్లోనూ రొమాన్స్ ఓ స్థాయిలో ఎలివేట్ చేశారు. ఇప్పటికే రెండు సింగిల్స్ రిలీజై ఆకట్టుకున్నాయి. చైతన్ భరద్వాజ్ సంగీతం డీసెంట్ అన్న టాక్ వినిపిస్తోంది. తదుపరి మరిన్ని పాటల్ని రిలీజ్ చేయనున్నారు.

అలాగే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ట్రేడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ డీసెంట్ గా సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. కింగ్ కెరీర్ బెస్ట్ డిజిటల్ ధర పలికిందని తెలుస్తోంది. ప్రఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ `మన్మధుడు 2` డిజిటల్ రైట్స్ ని 7.4కోట్లు చెల్లించి చేజిక్కించుకుందట. `సాహో` లాంటి భారీ చిత్రం ఆగస్టు 15 రేస్ నుంచి తప్పుకోవడం మన్మధుడు 2 కి కలిసొచ్చే అంశం అని చెబుతున్నారు. `మన్మధుడు 2`కి పాజిటివ్ టాక్ వస్తే చాలు రెండోవారంలోనూ డీసెంట్ వసూళ్లు సాధించే వీలుంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home