నెపోటిజం.. అలా అనేసిన అక్కినేనివారు!

0

అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మన్మథుడు 2’ టీమ్ మెంబర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మీడియాకు నాగార్జున ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

ఈమధ్య బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ నెపోటిజం పై భారీగా చర్చ సాగుతోంది. మరి నెపోటిజంపై నాగ్ అభిప్రాయం ఏంటని అడిగితే స్టార్లకు.. స్టార్ కిడ్స్ కు తమను తాము ఋజువుచేసుకోవాలనే విషయంలో ఎక్కువ ప్రెజర్ ఉంటుందని అన్నారు. ఏమాత్రం తేడా జరిగినా స్టార్ కిడ్స్ ను దారుణంగా ట్రోల్ చేస్తారని అన్నారు. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన కారణంగా తన కుమారులకు ఈ ప్రెజర్ ఎక్కువే అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తాను నెపోటిజం లాంటి వాటిని నమ్మనని తేల్చారు. వీటితో సంబంధం లేకుండా తన తండ్రిగారి లెగసీని ముందు తరాలకు అందించాలనే ఆలోచన ఉందని చెప్పారు.

నెపోటిజం అనేది ఒక సంక్లిష్టమైన అంశం. ఎవరైతే స్టార్ కిడ్స్ ఉన్నారో.. వారిని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో .. వారందరూ నెపోటిజం పెద్ద విషయం కాదని తీసిపారేస్తారు. ఎందుకంటే దాని వల్ల వారికి నష్టం ఉండదు.. పైగా లాభం. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతున్న వారిని..అదే అంశంపై అభిప్రాయం చెప్పమని అడిగితే వారు కంప్లీట్ గా వ్యతిరేకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తారు.. ఇలా చూస్తే నాగ్ చెప్పింది వన్ సైడ్ అభిప్రాయం.. ఏమంటారు?
Please Read Disclaimer