ఐదు నిమిషాల ముందే వీళ్లు పరిచయం

0

రకరకాల వివాదాల నడుమ ప్రారంభమైన `బిగ్ బాస్ -3`కి విపరీతమైన ప్రాచుర్యం వచ్చిన సంగతి తెలిసిందే. హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. పలువురు నటీనటులు.. యాంకర్లు.. యూట్యూబ్ స్టార్లు ఈసారి హౌస్ లోకి ప్రవేశించారు. హేమ-శ్రీముఖి-వరుణ్ సందేశ్-వితిక జంటతో పాటు బాబా భాస్కర్ వంటి ప్రముఖులు హౌస్ లో ట్రీటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేడెక్కించే వివాదాలు మొదలయ్యాయి. షోలో కస్సుబుస్సు మునుముందు మరింతగా పెరిగేట్టే కనిపిస్తోంది.

తాజాగా ఈ షోలో కంటెస్టెంట్ల ఎంపిక విషయమై హోస్ట్ నాగార్జున చెప్పిన ఓ నిజం ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఈ షోలోకి ప్రవేశించే 15 మంది సభ్యుల జాబితా తనకు ముందే తెలియదని కేవలం ఐదు నిమిషాల ముందు మాత్రమే పరిచయం అయ్యారని తెలిపారు. ఎంపికైన వారిపై అసలు తనకు ఎలాంటి సమాచారం ముందే వెల్లడించలేదని షాకిచ్చారు.

ఇకపోతే ఈ షోలో ప్రవేశించాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని లేదంటే అవకాశం రాదని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రలోభ పెట్టేవాళ్లు ఎదురయ్యారని.. సిఫార్సులు వంటివి లేకపోతే బిగ్ బాస్ షోలో అవకాశం రాదని పలువురు ఆరోపించారు. ఈ వివాదం గల్లీ నుంచి దిల్లీ వరకూ వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాలతో షో వీక్షించే ఆడియెన్ కి అంతో ఇంతో సందేహం కలిగింది. అయితే జెంటిల్ మేన్ నాగార్జున చెప్పిన దానిని బట్టి బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎంపిక పారదర్శకంగానే జరిగిందని అర్థమవుతోంది. అసలు బిగ్ బాస్ ప్రారంభానికి ముందు క్రేజు పెంచేందుకే ఈ వివాదాలు అంతా ప్రీప్లాన్డ్ అన్న చర్చ కూడా తెలుగు సినీమీడియాలో సాగుతోంది.
Please Read Disclaimer