బిగ్ బాస్ గుట్టు విప్పిన నాగ్!

0

ఎట్టకేలకు చిన్నపాటి వివాదాలు పోలీస్ కేసులతో ప్రారంభానికి ముందు కొంత హడావిడికి లోనైన బిగ్ బాస్ 3 నిన్న గ్రాండ్ గా లాంచ్ అయిపోయింది. స్టార్ మా గత ఆరు నెలల నుంచి చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చి వంద రోజుల హౌస్ హంగామా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఇది స్టార్ట్ కావడానికి ముందు అప్పుడెప్పుడో దేవదాస్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో తనకు నచ్చలేదని ద్వేషిస్తానని నాగార్జున చెప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అప్పుడో మాటా ఇప్పుడో మాటా అంటూ నెటిజెన్లు నిలదీసినంత పని చేశారు.

ఇది నాగ్ దృష్టిలో రాకుండా ఎలా ఉంటుంది. అయితే దానికి సమాధానం మాత్రం నిన్న ఇచ్చాడు కింగ్. వంద రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే ఇంట్లో ఉండటం తనకు నచ్చదని కానీ ఇంత మంది ప్రేక్షకులు ఈ షోను ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకుని తాను అందులో భాగమవ్వాలని వచ్చినట్టు చెప్పాడు. మొత్తానికి గ్రాండ్ ఎంట్రీ తో మోడల్స్ మధ్య తళుక్కుమని మన్మధుడిగా నాగ్ ఎంట్రీ ఓ రేంజ్ లో పేలింది. షో చేయడానికి కారణం ఎలా ఉన్నా అసలు ఛాలెంజ్ ఇక ముందుంది.

వారంలో రెండు రోజులు పార్టీసిపెంట్స్ తాలూకు ప్రోగ్రెస్ ని చూసుకుంటూనే వాళ్ళ ఎలిమినేషన్ తాలూకు ప్రాసెస్ లో బిగ్ బాస్ తో పాటు నాగార్జున భాగం కావాల్సి ఉంటుంది. గత ఏడాది నాని టేకోవర్ చేసినప్పుడు ఈ కారణంగానే ట్రోలింగ్ కు గురయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు అంత వివాదం రాలేదు కానీ ఈ సారి అల్లరి గ్యాంగ్ ఎక్కువగా ఉంది కాబట్టి కావాల్సినంత మసాలా ఉంటుందని బిగ్ బాస్ ఫాన్స్ ఆశిస్తున్నారు. నాగ్ దీన్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.




Please Read Disclaimer