మన్మధుడు ఫ్రాంఛైజీ ముగిసినట్టేనా?

0

కింగ్ నాగార్జున నటించిన `మన్మధుడు 2` ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సినిమాలో మన్మధుడి విశ్వరూపం చూడబోతున్నామని ట్రైలర్ చెప్పింది. కింగ్ ఘాటైన రొమాన్స్ తో ఫ్యాన్స్ కి సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఆగస్టు మన్మధుడి మంథ్ అని నాగ్ ఫిక్స్ చేశారు. అన్నట్టు ఈ సినిమా సక్సెసైతే అటుపైనా `మన్మధుడు` ఫ్రాంఛైజీ రన్ అవుతుందా? అంటే సందేహమేనని అర్థమవుతోంది.

కింగ్ నాగార్జున స్వయంగా మన్మధుడి సర్కిల్ పూర్తయిందని డిక్లేర్ చేశారు. పార్ట్ 1లో మన్మధుడు రొమాన్స్ చేయడు. ఆడాళ్లను ద్వేషిస్తాడు. పార్ట్ 2లో ఫుల్ రొమాన్స్. ఆడాళ్లను అస్సలు ద్వేషించడు. ఆ సంగతిని నాగార్జుననే స్వయంగా చెప్పారు. తాజా చిత్రానికి `మన్మథుడు 2` అనే టైటిల్ పెట్టడానికి కారణమేమంటే.. ఒరిజినల్ `మన్మథుడు` మగువల్ని ద్వేషిస్తాడు. కానీ ఈ మన్మథుడు వారిని లవ్ చేస్తాడు. సర్కిల్ ని ఫినిష్ చేసాం.. అందుకోసమే `మన్మథుడు 2` అని టైటిల్ పెట్టాం అని తెలిపారు. ఏడాది క్రితం ఒక ఫ్రెంచ్ సినిమా చూశాను. నా వయసుకు తగ్గ సినిమా ఇది అనిపించి చేశానని వెల్లడించారు.

ఇక మన్మధుడు సిరీస్ లో వేరొక సినిమా ఉంటుందా? అంటే సందేహమేనని నాగ్ కన్ఫామ్ చేసినట్టే కనిపిస్తోంది. 29 ఆగస్టుతో కింగ్ వయసు 60. అంటే ఆ వయసు తర్వాత కూడా ఇంకా గాళ్స్ తో రొమాన్స్ చేస్తే జనం అంగీకరిస్తారా? లక్కీగా ఫ్రెంచి సినిమా అతడికి చివరి అవకాశం తెచ్చింది. పరిశ్రమ అగ్ర కథానాయకులైన ఆ నలుగురిలో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న నాగార్జునకు ఇక `మన్మధుడు 2 `చివరి రొమాంటిక్ మూవీ కావొచ్చా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ఇప్పటికైనా కింగ్ అంగీకరిస్తారో లేదో?
Please Read Disclaimer