ఆ సీన్ల గురించి అడిగితే మన్మధుడి సెటైర్

0

కింగ్ నాగార్జున – రకుల్ ప్రీత్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `మన్మధుడు 2`. నాగార్జున- జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జునకు మీడియా నుంచి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మన్మధుడి ఘాటైన రొమాన్స్ గురించి ముద్దు సన్నివేశాల గురించి శరం లాంటి ప్రశ్నల్ని సంధించింది తెలుగు మీడియా. వాటికి నాగార్జున అంతే ధీటుగా స్పందించారు.

సరదా సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో నాగ్ నవ్వులు పూయిస్తూనే తెలివిగా సెటైర్లు వేశారు. ఓ సీనియర్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కింగ్ తనదైన శైలిలో రివర్స్ పంచ్ వేశారు. ఇంతకీ ఏదా ప్రశ్న అంటే? బాలీవుడ్ ప్రొడక్షన్ స్టైలే కాదు.. బాలీవుడ్ మేకింగ్ స్టైల్.. అక్కడ పోకడ కూడా మన సినిమాల్లో కనిపిస్తోంది కదా? అంటూ మన్మధుడి ఘాటైన రొమాన్స్ ముద్దు సీన్ల గురించి సదరు జర్నలిస్టు సెటైరికల్ గా ప్రశ్నించారు. అందుకు కింగ్ కూడా చాలా బ్యాలెన్సింగ్ గా ఆన్సర్ చేశారు.

బాలీవుడ్ తో పోలిస్తే మన స్టాండార్డ్స్ తక్కువేమీ కాదని అన్నారు నాగార్జున. “బాలీవుడ్ లో లాగా లిప్ లాక్.. రొమాన్స్ గురించి అడుగుతున్నా!!“నని జర్నలిస్ట్ మళ్లీ రెట్టిస్తూ ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ .. “గీతాంజలి చూశారా మీరు? 2.30 మినిట్స్ సీన్ ఉంటుంది“ అంటూ నవ్వేశారు. అప్పటి ఏజ్ వేరు కదా? అని ప్రశ్నిస్తే.. “ఏవండీ ఇంకా ప్రాక్టీస్ కూడా అయ్యిందండీ! మెచ్యూరిటీ వచ్చింది“ అనీ నవ్వేశారు. ప్రాక్టీస్ అయ్యింది కాబట్టే కింగ్ అరవైలోనూ అలా చెలరేగుతున్నారన్నమాట!! `మన్మధుడు 2` ట్రైలర్ సైతం `చిలిపి సరసాల మన్మధుడు`ని పరిచయం చేసింది. ఏదేమైనా నాగార్జున ఈ ఏజ్ లోనూ ఘాటైన సన్నివేశాలతో చెలరేగుతున్న తీరు చూస్తుంటే ఆయన స్టామినాకి హ్యాట్సాప్ అంటూ యూత్ లో ఒకటే చర్చకొస్తోంది. ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా `మన్మధుడు 2` చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Please Read Disclaimer