వచ్చే సమ్మర్ కే బంగార్రాజు

0

ప్రస్తుతం మన్మధుడు 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ బిగ్ బాస్ 3ని హోస్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్న కింగ్ నాగార్జున నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి సర్వత్రా ఆసక్తి ఉండటం సహజం. దానికి నాగ్ క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. అన్ని కుదిరి వీలైనంత త్వరగా కళ్యాణ్ కృష్ణ పక్కా స్క్రిప్ట్ తో వస్తే సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజుని సెట్స్ పైకి తీసుకెళ్తామని చెప్పేశాడు. ఇది ఎప్పటి నుంచో చర్చలో ఉంది కాని నాగ్ స్వయంగా దీని గురించి ఈ మధ్య ఎక్కడా మాట్లాడలేదు.

ఇప్పుడు స్వయంగా చెప్పడంతో ఇక ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ అంత త్వరగా మాత్రం బంగార్రాజు వచ్చే ఛాన్స్ లేదు. ఎప్పుడు మొదలుపెట్టినా 2020 సమ్మర్ కి గాని విడుదల చేసే అవకాశం ఉండదు. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కాబట్టి ఆ మాత్రం టైం అవసరమే. కళ్యాణ్ కృష్ణ అన్నయ్య ఇటీవలే కాలం చేయడంతో అతను విషాదంలో ఉన్నాడు. కోలుకున్న వెంటనే నాగ్ తో చర్చల్లో పాల్గొని ఫైనల్ చేసే అవకాశం ఉంది.

ఇక బిగ్ బాస్ 3లో అసలు పరీక్ష నాగార్జునకు ఈ వీకెండ్ నుంచి మొదలు కానుంది. ఎలిమినేషన్ తో పాటు వారం రోజులు పార్టిసిపెంట్స్ చేసిన రచ్చ గురించి మాట్లాడాలి కాబట్టి మంచి మసాలా టాస్క్ ఉండేలా కనిపిస్తోంది. సోషల్ మీడియా సైతం నాగ్ దీన్ని ఎలా డీల్ చేయబోతున్నాడా అని ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎవరు పాల్గొంటున్నారో షూట్ కు వెళ్లే 5 నిమిషాల ముందు వరకు తెలియదని చెప్పిన నాగ్ కొత్త షాక్ ఇచ్చారు. ఇవే పేర్లు గత వారం రోజులుగా ప్రతి మీడియాలోనూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అసలైన హోస్ట్ కి మాత్రం చివరి నిమిషం దాకా తెలియదంటే నమ్మొచ్చంటారా




Please Read Disclaimer