నాగ్ శివ – నిన్నే పెళ్లాడతా సినిమాలు పోగొట్టుకున్నాడట!

0

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది కనుక సినిమాల భద్రత విషయం పెద్ద సమస్య కాదు. కాని ఒకప్పుడు సినిమాలు రీల్స్ రూపంలో ఉండేవనే విషయం తెల్సిందే. ఒక సినిమా చాలా రీల్స్ గా ఉండేది. ఆ కారణంగా పాత సినిమాలను భద్ర పర్చడం అప్పటి నిర్మాతలకు ఇబ్బందిగా మారేది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా రీల్స్ చెడిపోవడం.. ఏదో రకంగా నాశనం అవ్వడం జరిగింది. అలా తెలుగు సినిమాకే కాకుండా ఎన్నో భాషలకు సంబంధించిన సినిమాలు ఇప్పుడు కనీసం చూడ్డానికి కూడా లేవు. కొన్ని డిజిటల్ రూపంలోకి మార్చినా కొన్ని డిజిటల్ రాక ముందే నాశనం అయ్యాయి. ఇండియాలో మొదటి తరం సినిమాల్లో సగానికి ఎక్కువగా ఇప్పుడు లేవు. అందుకే పాత సినిమాలను కాపాడుకునే ఉద్దేశ్యంతో ఫిల్మ్ హెరిటేజ్ అనే ఫౌండేషన్ ను శివేంద్ర సింగ్ దుంగాపూర్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఫిల్మ్ హెరిటేజ్ పౌండేషన్ గత నాలుగు సంవత్సరాలుగా చలన చిత్రాల పరిరక్షణ మరియు పునరుద్దరణ వర్క్ షాపులను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మొదటి సారి హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోలో ఈ విషయమై ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ లో నిర్వహించబోతున్న వర్క్ షాప్ కు సంబంధించిన విశేషాలను వెళ్లడించేందుకు జరిగిన సమావేశంలో శివేంద్ర సింగ్ తో పాటు ఇంకా ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున మరియు అమలలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ తాను నటించిన ‘శివ’ చిత్రంను నాలుగు అయిదు సంవత్సరాల క్రితం రీ రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేశాము. కాని ఎవరో ఒరిజినల్ ప్రింట్ పై కాపీ జల్లినట్లుగా మచ్చలుగా స్క్రీన్ పై వచ్చింది. దాంతో రీ రిలీజ్ ఆలోచన వదిలేశాం. ఇక నేను హీరోగా నటించి నిర్మించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం ఒరిజినల్ ప్రింట్ కూడా మిస్ అయ్యాము. నేను ఇప్పటి వరకు నటించిన 90 సినిమాల్లో ఎన్ని సినిమాల ఒరిజినల్ ప్రింట్స్ ఉన్నాయో నాకే తెలియదని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశాడు.

సినిమాల పరిరక్షణ మరియు పునరుద్దరణ గురించి అవగాహణ లేకపోవడంతో చాలా నష్టపోయామని.. ఎన్నో అద్బుతమైన సినిమాలను ఈతరం వారికి అందించే వీలు లేకుండా పోయిందని సమావేశంలో హాజరైన వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా తమ సినిమా పరిరక్షించి భవిష్యత్తు తరాల వారికి అందించేందుకు అవగాహణ కలిగి ఉండాలంటూ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫౌండర్ శివేంద్ర అన్నారు. డిసెంబర్ 8 నుండి 15 వరకు ఈ వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.



Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home