‘బిగ్ బాస్ సీజన్ 3’.. నాగ్‌ని ఇంప్రెస్ చేసిన శ్రీముఖి.. స్వీట్ హగ్స్

0

‘రియాలిటీ షోలందు బిగ్ బాస్ షో వేరయా’ అన్నట్టుగా దేశంలో నలుమూలలా విస్తరిస్తోంది బిగ్ బాస్ రియాలిటీ షో. బుల్లి తెర ప్రేక్షకుల్ని గత రెండు సీజన్లుగా అలరిస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్‌కి ఎంట్రీ ఇచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం రాత్రి (జూలై 21) 9 గంటలకు స్టార్ మాలో ప్రారంభమైంది.

2006లో హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో గత 12 సీజన్లుగా టాప్ రియాలిటీ షోగా వర్ధిల్లుతోంది. 2019 నాటికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా అవతరించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో విస్తరించింది. 

ఈ షోకి తెలుగులోనూ మంచి ఆదరణ ఉండటంతో గత రెండు సీజన్లుగా ప్రారంభమైంది. 2017 జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో బుల్లి తెరపై బిగ్ బాస్ సన్సేషనల్ హిట్ అయ్యింది. టాప్ రేటింగ్‌తో టీఆర్పీ రేటింగ్‌లో అగ్రభాగాన నిలిచింది. 70 రోజుల పాటు 16 మంది కంటెస్టెంట్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించింది. 

బిగ్ బాస్ 1లో పాల్గొన్న పోటీదారులు: 
అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివ బాలాజీ, ఆదర్శ్, హరి తేజ, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్). ఈ 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్నారు. వీరిలో ఫైనల్ కన్టెస్టెంట్స్‌గా ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చనలు పోటీ పడగా.. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచి రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు. 

ఇక రెండో సీజన్ విషయానికి వస్తే.. 2018 జూన్‌లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభమైంది. ఈ సీజన్‌లో గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్ నాయుడు, నందినిలు కంటెస్టెంట్స్‌గా ఉండగా.. బుల్లి తెర నటుడు కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్‌గా అవతరించాడు. 

బిగ్ బాస్ సీజన్ 1, 2లు బుల్లితెరపై రేటింగ్స్‌ను కొల్లగొట్టగా.. సీజన్ 1 కంటే సీజన్ 2లో కాస్త ఊపు తగ్గిందని.. కంటెస్టెంట్స్ వీక్‌గా ఉండటంతో పాటు నాని హోస్టింగ్ ఎన్టీఆర్ కంటే మెరుగ్గా లేకపోవడంతో ఆడియన్స్ ఊహించినంత ఎంటర్‌టైన్మెంట్‌ను అందించలేకపోయింది. 

దీంతో బిగ్ బాస్ సీజన్ 3ని బాధ్యతల్ని తీసుకున్నారు కింగ్ నాగార్జున. ‘మనసు కోతి లాంటిది.. మరి అలాంటి మనసున్న కొంతమంది మనుషులు ఒక ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో వాళ్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహం నింపే శక్తిగల వ్యక్తి ఎవరు?.. అతను ఎవరో కాదు.. నేనే’ మీ కింగ్ నాగార్జున అంటూ బుల్లితెరపై సందడి చేసేందుకు వచ్చేశారు హోస్ట్ నాగార్జున.

మూడో సీజన్ తొలి ఎపిసోడ్‌ అప్డేట్స్ 

✦ బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో ‘నడిచే స్టైల్ ఏమో రాకింగ్’ అంటూ కింగ్ సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. 
✦ వస్తూ రావడంతోనే షోకి గ్లామర్ ఇచ్చిన నాగార్జున.. గత రెండు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్, నానికి థాంక్స్ చెప్పారు. 
✦ ఇక ఎంట్రీలోనే ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. గత రెండు సీజన్ల మాదిరిగా కాకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే 15 మంది కంటెస్టెంట్స్‌ని మీరే సెలెక్ట్ చేయాలంటూ నాగార్జునను బిగ్ బాస్ ఆదేశించారు. 
✦ సెలెక్ట్ చేసిన చీటీలలో నుండి ఒక చీటీ తీసి తీన్మార్ సావిత్రి (శివజ్యోతి) ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌కి తీసుకువచ్చారు. 
✦ రెండో కంటెస్టెంట్‌గా టీవీ యాక్టర్ రవిక్రిష్ణ ఎంట్రీ ఇచ్చారు. 
✦ మూడో కంటెస్టెంట్‌గా డస్మాష్ స్టార్ అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. 
✦ ఇక తొలి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన తీన్మార్ సావిత్రి మాటల పటాసులు పేల్చడం మొదలు పెట్టింది. 
✦ బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ కోసం ఉంచిన బెడ్స్‌లో సింగిల్ బెడ్‌ను ఎంచుకుంది సావిత్రి 
✦ ఇక వచ్చీ రావడంతో ముగ్గురు కంటెస్టెంట్‌కి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ 
✦ రాబోయే మిగిలిన సెలబ్రిటీలను అడిగేందుకు కొన్ని ప్రశ్నలు ఉంచామని వాటిని అడగాలంటూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ 
✦ ఇక నాలుగో సెలబ్రిటీగా టీవీ 9 యాంకర్ జాఫర్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. 
✦ అందర్నీ ప్రశ్నలు అడిగి విసిగించే జాఫర్‌ని అతని స్టైల్‌లోనే ప్రశ్నలు అడిగారు నాగార్జున. 
✦ ఇక ఎప్పుడైనా తప్పుడు ఇంటర్వ్యూలు చేశారా అంటే అబ్బో చాలా చేశా అంటూ సమాధానం ఇచ్చారు జాఫర్. 
✦ ఐదో సెలబ్రిటీగా బుల్లెట్ మీద వచ్చె బుల్ రెడ్డి అంటూ ఊరమాస్ సాంగ్‌తో గ్లామర్ ఎంట్రీ ఇచ్చింది హిమజ. 
✦ నాగార్జునను తొలిసారి దగ్గర నుండి చూసిన హిమజ ఆనందంతో పొంగిపోయింది ఈ గుంటూరు సుందరి. 
✦ నాగ్‌ని అడిగి మరీ ఓ సారి టచ్ చేయండని.. నమ్మలేకపోతున్నా ఒళ్లు చల్లబడిపోయింది అన్నారు హిమజ. 
✦ ఇక బిగ్ బాస్ హౌస్‌కి పంపుతూ.. హగ్ ఇచ్చారు నాగార్జున 
✦ ఆరో సెలబ్రిటీగా రాహుల్ సిప్లిగంజ్‌ హుషారైన సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. 
✦ నాగార్జున అడిగిమరీ ఆయనతో మరో పాట పాడించుకున్నారు 
✦ ఇక హౌస్‌కి వెళ్లిన తరువాత కూడా పాటతో హుషారెత్తించారు రాహుల్ 
✦ రాహుల్ ఎంట్రీ తరువాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ మన్మథుడినే మెప్పించిందే ఏడో కంటెస్టెంట్ రోహిణి. 
✦ సోగ్గాడే చిన్నినాయనా అని పిలిచావ్..గా వచ్చాడు ఏం ఇస్తావ్ అని నాగార్జున అడగడంతో ‘మీరు ఏం అడిగినా ఇచ్చేస్తా’ అంటూ సిగ్గు మొగ్గైంది రోహిణి. 
✦ మీరు ఏం ఇస్తావ్ అని అడగాల్సిన అవసరం లేదని.. ఇవ్వడానికి బోలెడు మంది రెడీగా ఉంటారు అంటూ ఎంట్రీలోనే అదరగొట్టింది రోహిణి. 
✦ ఎనిమిదో కంటెస్టెంట్‌గా అదిరిపోయే స్టెప్‌లో స్టేజ్‌ను షేక్ చూస్తూ సూపర్ ఎంట్రీ ఇచ్చారు బాబా భాస్కర్ 
✦ తొమ్మిదో కంటెస్టెంట్‌గా గ్లామర్ బ్యూటీ, ఉయ్మాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం డాన్స్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. 
✦ పదో కంటెస్టెంట్ గా నటి, పాపులర్ సెలబ్రిటీ హేమ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. 
✦ కింగ్ నాగార్జున ఆమెకు స్వాగతం పలుకుతూ వంట వచ్చా అని అడగడంతో చింపేస్తా.. అని సమాధానం ఇచ్చింది. 
✦ బిగ్ బాస్ హౌస్‌లో కిచెన్‌ని స్వాధీనం చేసుకుంటా అనేసింది హేమ 
✦ పదకొండో కంటెస్టెంట్‌గా అలీ రజా సిక్స్ ప్యాక్‌తో నడిచే స్టైల్ ఏమో రాకింగ్ అంటూ స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. 
✦ 12 కంటెస్టెంట్‌గా కమెడియన్ మహేష్ విట్టా అదిరే ఎంట్రీ ఇచ్చారు.. వచ్చీ రావడంతోనే సీమ స్లాంగ్‌‌తో అదరగొట్టారు మహేష్ విట్టా. 
✦ ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లితెర రచ్చపాప.. యాంకర్ శ్రీముఖి 13 కంటెస్టెంట్‌గా అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్‌తో స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది శ్రీముఖి. 
✦ స్టేజ్‌పై ఉన్నంత సేపూ హుషారెత్తించి శ్రీముఖి. ఇక బిగ్ బాస్ షో కి ఎందుకు వచ్చావు బిజీ షెడ్యూల్ వదలేసి అని నాగార్జున అంటే.. నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటే చాలా అంటూ బదులిచ్చింది శ్రీముఖి. 
✦ ఇక తొలి నుండి బిగ్ బాస్ షో కంటెస్టెంట్‌గా తొలి నుండి ప్రచారంలో ఉన్న కపుల్ జంట.. వరుణ్ సందేశ్, వితికా షెరు.. నిజంగా నేనేనా అంటూ అనే పాటతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 
✦ ఇక స్టేజ్‌పైకి వచ్చిన తరువాత మీ ప్రేమకథ ఎలా మొదలైంది అని వరుణ్, వితికా షెరు లవ్ స్టోరీని అడిగితెలుసుకున్నారు. 
✦ కపుల్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరిద్దరూ ఫైనల్‌కి వస్తే ఏం చేస్తారు అని వితికాని నాగార్జునని అడగ్గా.. నేను గెలవాలనుకుంటా అంది. 
✦ అదే ప్రశ్న వరుణ్‌ని అడిగితే.. తను గెలిచినా నేను గెలిచినట్టే ఎవరు గెలిచినా పర్లేదని ఆకట్టుకున్నారు వరుణ్ సందేశ్. 
✦ కాగా.. బిగ్ బాస్ స్టేజ్ నుండి మీ భార్యను ఎత్తుకుని బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లగలవా? అని నాగార్జున అడగడంతో.. వితికాని ఎత్తుకుని బిగ్ బాస్ హౌస్‌కి తీసుకుని వెళ్లాడు వరుణ్. 
✦ ఇక నేటి ఎపిసోడ్ మొత్తం కంటెస్టెంట్స్ 15 మంది హౌస్‌లో ఎంట్రీ ఇవ్వగా.. రేపటి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఉండబోతుంది. ఎంట్రీ ఇచ్చి ఒకరోజు పూర్తి కాగానే.. శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షెరు, బాబా భాస్కర్, భాస్కర్‌లను నామినేట్ అయ్యారంటూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ఐదుగురు షాక్‌‌లో ఉండగా.. మూడో సీజన్ తొలి ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది. 
Please Read Disclaimer