టెన్షన్ పెడుతున్న హోస్ట్ ఏం చేస్తారో?

0

కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్న `బిగ్ బాస్ సీజన్ 3` టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో పార్టిసిపెంట్స్ రక్తి కట్టిస్తుంటే .. ఇంటికి వెలుపల నాగార్జున అంతే పెద్ద గేమ్ ఆడేస్తూ టీవీక్షకుల్ని కట్టి పడేస్తున్నారు. అందుకే వీకెండ్ రెండ్రోజులు (శని- ఆదివారాలు) ఆయన రాక కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేషన్ పరిధిలోకి వస్తే.. అందులోంచి ముగ్గురిని సేఫ్ అంటూ బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ సేవ్ చేసింది. మహేష్-పునర్నవి- హిమజ ఎలిమినేషన్ లో ఉన్నారు. ఆ ముగ్గురికి ట్విస్టు పడడంతో ఫ్యాన్స్ ఎగ్జయిట్ మెంట్ తో ఉన్నారు. అయితే ఇప్పుడు నాగార్జున వచ్చి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేల్చాల్సి ఉంది.

అయితే ఆయన ఈ వారం వస్తారా రారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ లో పడింది. నేడు నాగార్జన 60వ బర్త్ డే సందర్భంగా స్పెయిన్ ఇబిజలో కుటుంబ సమేతంగా వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య- సమంత.. అఖిల్ మరికొందరు స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే నాగార్జున అండ్ టీమ్ అక్కడ ఉన్నారు కాబట్టి అభిమానుల్లో ఒకటే టెన్షన్ నెలకొంది. నేడు గురువారం కాబట్టి మరుసటి రోజుకే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి … మరి ఈ వీకెండ్ ఏం చేయబోతున్నారు? నాగార్జున తిరిగి వస్తున్నారా? లేక ఈ ఎపిసోడ్ వరకూ ఎలిమినేషన్ ఆపేస్తారా? అంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏడు సముద్రాలు ఆవల ఉన్న ఇబిజ నుంచి హైదరాబాద్ కి రావడానికి మూడు విమానాలు మారాలి. 20 గంటలు పైగా సమయం పడుతుంది. అలాంటప్పుడు నాగ్ అందుబాటులోకి వస్తారా? అంటూ అందరూ అభిమానులు ఒకటే టెన్షన్ పడిపోతున్నారు. నేటి బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని నాగార్జున వెంటనే రిటర్న్ ప్రయాణం చేస్తున్నారా? అన్నది వేచి చూడాలి. ఒకవేళ అనుకున్న సమయానికి హోస్ట్ చేరిపోతే కమిట్ మెంట్ ని మెచ్చుకుని తీరాలి. అయితే కొందరు ఆ రెండు ఎపిసోడ్స్ ని ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసి ఉంటారులే అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తుండడం ఆసక్తికరం.
Please Read Disclaimer