బిగ్ బాస్ 3 లీకులు షురు

0

ఇటీవలే కమింగ్ సూన్ అని బిగ్ బాస్ 3 ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య భారీగా ఉంది . ఎన్ని వివాదాలు ఉన్నా ఎన్ని కామెంట్లు వచ్చినా ఆదరణ విషయంలో బిగ్ బాస్ అన్ని బాషల్లోనూ దూసుకుపోతున్న మాట వాస్తవం. యాంకర్ గా ఎవరు వస్తారు అనే దాని మీద నెలల తరబడి డిబేట్ జరిగాక ఫైనల్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే స్వయంగా చూసే దాకా ఇదీ నమ్మలేం అనుకునే ఫ్యాన్స్ లేకపోలేదు.

వాళ్ళ సందేహాలు తీరుస్తూ బిగ్ బాస్ 3కు లీకులు మొదలైపోయాయి. నాగ్ మీద తీస్తున్న ప్రోమో తాలుకు వీడియో బైట్ ఒకటి ఇన్స్ టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది. అందులో నాగ్ సెట్ లో స్టైల్ గా నడుచుకుంటూ వస్తుండగా చుట్టూ ఉన్న సెట్ వాతావరణం అది బిగ్ బాస్ అని చెప్పకనే చెప్పింది. సో బాలన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా తీరిపోయినట్టే. ఇక పార్టిసిపెంట్స్ గా ఎవరు వస్తారు అనే సస్పెన్స్ మాత్రం కొనసాగనుంది.

మొదటి రెండు సీజన్లను నడిపిన జూనియర్ ఎన్టీఆర్ నానిలను మరిపించేలా నాగ్ తనదైన శైలిలో దీన్ని ఎలా నడుపుతాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న బిగ్ బాస్ 3లో ఎవరు పాల్గోనాలో ఇప్పటికే ఫైనల్ అయ్యిందనే టాక్ ఉంది. సెలెబ్రిటీలతో పాటు కొందరు టిక్ టాక్ స్టార్స్ ని కూడా ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇవన్ని ఊహగానాలే కాని తేది దగ్గరికి వచ్చే కొద్ది వీటికి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా సస్పెన్స్ కొనసాగించక తప్పదు
Please Read Disclaimer