సీక్వెల్ ని లైట్ తీసుకున్న నాగార్జున?

0

అక్కినేని నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`. నాగ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర లో సోగ్గాడి గా నటించి మెప్పించారు. ఈ చిత్రం దాదాపు 50 కోట్లు వసూళ్లని సాధించి నాగ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 2016 జనవరి 15 విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా `బంగార్రాజు` పేరుతో సీక్వెల్ చేయాలని నాగార్జున ప్లాన్ చేశారు. కల్యాణ్ కృష్ణ ఈ ప్రాజెక్టు కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న సంగతి విదితమే.

ఇంతకాలం ఈ సీక్వెల్ గురించి రక రకాలుగా ప్రచారమైంది. ఉంటుందా లేదా? అన్నదానిపైనా క్లారిటీ రాలేదు. ఇటీవలి కాలం లో అయితే అసలు నాగ్ ఆ సీక్వెల్ మాట ఎత్తడం లేదు. ఆ మధ్య మీడియా అడిగితే..“కథ రెడీ అవుతోంది. తొలి భాగానికి మించి వుండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం“ అని నాగార్జున చెప్పుకొచ్చారు. బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య నటిస్తాడని కూడా ఇంతకు ముందు ప్రచారం జరిగింది.

కానీ ఇప్పటికీ దీనిపై ఏ క్లారిటీ రాలేదు. సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. `నేలటిక్కెట్` ఫ్లాపవ్వడంతో దర్శకుడు కల్యాణ్ కృష్ణ కు అది ఇబ్బందికరం అయ్యింది. దీంతో నాగ్ `బంగార్రాజు` విషయం లో బ్యాక్ స్టెప్ తీసుకున్నాడన్నది తాజా వాదన. దీనికి బలాన్ని చేకూరుస్తూ నాగార్జున తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అది కూడా ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

రామ్గోపాల్ వర్మ మాటలు నమ్మి `ఆఫీసర్` సినిమా కోసం పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నాగార్జున ఆ సినిమాతో భారీ డిజాస్టర్ ని చవిచూసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కు ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సోలమన్ దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక సమాచారం త్వరలోనే బయటికి రానున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ న్యూస్.
Please Read Disclaimer