10 రోజులకే ఫైనల్ రన్ – ఎవరు బాధ్యులు ?

0

అక్కినేని నాగార్జున క్లాసిక్ టైటిల్ ని రిపీట్ చేస్తూ వచ్చిన మన్మధుడు 2 ఆశించిన ఫలితం కాదు కదా మినిమం రిజల్ట్ కూడా అందుకోలేకపోయింది . చాలా ఏరియాలలో ఇప్పటికే డెఫిషిట్లతో ఎగ్జిబిటర్లు అతి కష్టం మీద నెట్టుకొస్తున్నారు. పట్టుమని పాతిక కోట్ల షేర్ కూడా రాబట్టలేక చతికిలబడిపోయింది. నాగ్ స్వయంగా రంగంలో దిగి సినిమా హిట్టు అని సక్సెస్ ఈవెంట్లు ప్రెస్ మీట్లు పెట్టినా ప్రయోజనం కలగలేదు.

కేవలం 10 రోజులకే అధిక శాతం కేంద్రాల్లో ఫైనల్ రన్ కు రావడం నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోకు అంత ఈజీగా మింగుడుపడేది కాదు. అలా అని ఇలాంటివి నాగ్ చూడలేదని కాదు. డిజాస్టర్లు ఎవరికైనా కామనే. కాని కంటెంట్ విషయంలో దీని మీద వచ్చినన్ని విమర్శలు గతంలో ఎన్నడూ రాలేదన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కు సైతం ఎదురయ్యింది. రెండు వారాలు టచ్ కాకుండానే ఖాళీ ధియేటర్లు దర్శనమిచ్చాయి.

ఇక్కడ ఫెయిల్యూర్స్ కి కారణాలు విశ్లేషించుకుంటే కంటెంట్ ఎంత అసంపూర్ణంగా అనిపిస్తున్నా కథ మీదనో దర్శకుడి మీదనో చూపిస్తున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఫైనల్ గా రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తోంది. పట్టుమని రెండు వారాలు కూడా స్టడీగా ఉండలేని స్థితిలో క్రేజీ సినిమాలు ఉంటే పెట్టుబడులకు రికవరీలు ఎక్కడి నుంచి వస్తాయి. ఇదే బయ్యర్లను వేధిస్తున్న ప్రశ్న. కేవలం కాంబినేషన్లు నమ్ముకుని కొంటే పరిస్థితి ఎలా ఉంటుందో వసూళ్లు దానికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా స్క్రిప్ట్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి మూల్యం చెల్లిస్తూనే ఉండాలిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home