వర్మ హీరోయిన్ ‘హాట్’ అండ్ ‘బోల్డ్’ ట్రైలర్!

0

నైనా గంగూలీ… ఈ పేరు చెప్తే బహుశా అందరికీ గుర్తుకు రాకపోవచ్చు గానీ, వర్మ దర్శకత్వం వహించిన “వంగవీటి” సినిమాలో రత్నకుమారి పాత్రను పోషించిన హీరోయిన్ అన్నా… వర్మ తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘మేరి బేటీ సన్నీలియోన్ బన్నా చాహతి హై, గన్స్ అండ్ థైస్’ ఫేం అన్నా… టక్కున నైనా గంగూలీ రూపం సాక్షాత్కరిస్తుంది. అంతలా వర్మ హీరోయిన్ గా బ్రాండ్ పడ్డ ఈ బ్యూటీ, తాజాగా ఓ వెబ్ సిరీస్ లో కనిపించింది.

“చరిత్రహీన్” పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ ఈ నెల 29 నుండి ప్రారంభం కానుండగా, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం ఫుల్ హాట్ అండ్ బోల్డ్ సన్నివేశాలతో నిండిపోయి ఉంది. సెన్సార్ నిబంధనలు లేని కారణంగా సినిమా స్థాయిని దాటిపోయి, ఈ వెబ్ సిరీస్ లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి హాట్ సిరీస్ లలో నటించేందుకు తాను సిద్ధమన్న సంకేతాలను నైనా గంగూలీ పంపినట్లయ్యింది.
Please Read Disclaimer