‘నగ్నం’ ట్రైలర్ 2.. బాబోయ్! అడల్ట్ కిక్ మామూలుగా లేదు

0

వివాదాలకు, విలక్షణతను కేరాఫ్ అడ్రస్ తానుతప్ప ఇంకెవరూ లేరన్నట్లుగా వ్యవహరిస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ‘శివ’ సినిమాతో టాలీవుడ్ జనానికి కొత్త టేస్ట్ చూపించిన ఆయన.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఆడియన్స్ టేస్ట్, ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పసిగడుతూ తనదైన స్టైల్‌లో మూవీస్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే నేటి యువతను ఆకర్షించేందుకు స్కెచ్ వేసిన వర్మ.. కాస్త రూట్ మార్చేసి అడల్ట్ సినిమాల వైపు కన్నేశారు.

ఇటీవలే ‘క్లైమాక్స్’ అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను ఎడారి లోకి తీసుకెళ్లి వివిధ భంగిమల్లో బంధించి కాసులు కురిపించుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి ‘నగ్నం‘ (NAKED) అంటూ మరో అడల్ట్ మూవీని రెడీ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక తన సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా స్పెషాలిటీ చూపించే ఆయన, ఇటీవలే ఈ నగ్న సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల చేత ”వామ్మో! వర్మ.. ఎందిది? ఇంత పైత్యమా” అనిపించుకున్నారు.

ఆ ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు జనాలకు షాకిచ్చాయి. ఎక్కడెక్కడో కెమెరా పెడుతూ మ్యాజిక్ చేసిన ఆయన.. తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. అంతకుమించి అన్నట్లుగా ఇందులోనూ అడల్ట్ సన్నివేశాలతో జనాల్లో మైకం తెప్పించారు వర్మ. మరి ఈ ట్రైలర్, అందులోని సన్నివేశాలపై ఓ లుక్కేద్దామా..
Please Read Disclaimer