బరువు తగ్గిన నమితపై కన్నేస్తారా?

0

బిల్లా – సింహా లాంటి సినిమాల్లో బబ్లీ లుక్ తో నమిత ఇచ్చిన ట్రీట్ ని అభిమానులు మర్చిపోలేరు. బబ్లీగా ఉన్నా బిల్లా చిత్రంలో నమిత బికినీ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సింహమంటి చిన్నోడే అంటూ సింహా వెంట పడుతూ నందమూరి ఫ్యాన్స్ కంటికి కునుకు లేకుండా చేసింది. అందుకే ఇంకా అభిమానులు అవే అందాల్ని నమితలో ఊహించుకుంటున్నారు.

అయితే అలాంటివారందరికీ షాకింగ్ న్యూస్. నమిత ఇప్పుడు మారిన మనిషి. తన రూపం పూర్తిగా మారిపోయింది. బబ్లీ స్టాటస్ నుంచి స్లిమ్ స్టాటస్ కి వచ్చేసింది. ఈ కొత్త రూపం చూస్తే షాక్ తినాల్సిందే. గత కొంతకాలంగా తన రూపం మార్చుకునేందుకు జిమ్ముల వెంట అహోరాత్రలు శ్రమిస్తున్న ఈ బ్యూటీ సరికొత్త ఛేంజోవర్ తో కట్టి పడేస్తోంది. ఫిజికల్ గా ఇంత మార్పు సాధ్యమా? అనేంతగా అమ్మడు మారిపోయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది.

నమిత మారిన రూపం చూశాక.. మెగాస్టార్ సినిమాలో కొరటాల కామియో ఛాన్సిస్తాడేమో.. బాలయ్య రూలర్ లో కే.ఎస్.రవికుమార్ పిలిచి అవకాశం ఇచ్చేస్తారేమో! అన్న సందహాలొస్తున్నాయి. మరోసారి మన అగ్ర హీరోలు కరుణించాలే కానీ నమిత ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమేనని సింప్టమ్స్ చెబుతున్నాయి. మరి మన దర్శకనిర్మాతలు ఓ చూపు అటువైపు చూస్తారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer