హిఈజ్ సో క్యూట్ కవర్ సాంగ్ లో నమ్రత

0

మహేష్ బాబు 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం విడుదలకు నెల రోజులు ఉండగానే ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఈ చిత్రంను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమోషన్ ను చాలా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇటీవలే విడుదలైన హి ఈజ్ సో క్యూట్ పాట అమ్మాయిలను బాగా ఆవకర్షిస్తోంది.

హి ఈజ్ సో క్యూట్ పాటకు భారీగా కవర్ సాంగ్ లు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ పాటకు కవర్ సాంగ్ చేయాలని భావిస్తున్నారట. మహేష్ బాబు కూడా ఆ కవర్ సాంగ్ లో కనిపిస్తాడని సమాచారం అందుతోంది. నమ్రత కవర్ సాంగ్ చేస్తే సోషల్ మీడియాలో సెన్షేషనల్ అవ్వడం కన్ఫర్మ్. నమ్రత గతంలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. కనుక ఆమెకు కవర్ సాంగ్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు.

ఈ పాటకు నిమిషం పాటు నమ్రత మరియు మహేష్ బాబులు కలిసి స్టెప్పులు వేస్తారంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ కవర్ సాంగ్ ను ప్రత్యేకంగా షూట్ చేసేందుకు ఒక టీం కూడా రెడీ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా నమ్రత నుండి ఈ కవర్ సాంగ్ వచ్చే అవకాశాలున్నాయని.. మహేష్ బాబు సినిమాల ప్రమోషన్ విషయంలో నమ్రత చాలా ఇవ్వాల్వ్ మెంట్ ఉంటుంది. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రమోషన్ లో కూడా నమ్రత తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది.
Please Read Disclaimer