ఫ్యామిలీలోనే యాక్టింగ్ ఉంది.. అంతే!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ప్రమోషన్స్ లో జోరు చూపిస్తారనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి మరీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్ లో నటించారు. సతీమణి నమ్రత.. పిల్లలు గౌతమ్.. సితారలతో కలిసి నటించిన ఆ ఫ్యామిలీ యాడ్ చాలామందిని ఆకట్టుకుంది. మహేష్ మొదటినుంచి ఫ్యామిలీ మ్యాన్.. అయితే ఇలా యాడ్ లో అందరూ కనిపించడం ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ ట్రీట్ లా అనిపించింది.

ఈ యాడ్ లో పిల్లలను నటింపజేసే విషయంలో నమ్రత కాస్త టెన్షన్ ఫీలయ్యారట. గౌతమ్.. సితార ఇద్దరికీ ఇది టీవీ డెబ్యూ కావడంతో వారు ఎలా కనిపిస్తారో.. కెమెరాను ఎలా ఫేస్ చేస్తారో అనే ఆలోచనలు వచ్చాయట. అయితే టీవీ యాడ్ చూసిన తర్వాత మాత్రం రిలీఫ్ వచ్చిందట. తన పిల్లలు అని కాదు కానీ ఇద్దరికీ పుట్టుకతోనే నటన వచ్చేసింది.. సహజనటులు అని కితాబిచ్చేశారు నమ్రత. యాడ్ చూస్తే నమ్రత చెప్పేది నిజమేననిపిస్తుంది.

మహేష్ ప్రెజెంట్ జెనరేషన్ సూపర్ స్టార్. ఇక మహేష్ నాన్నగారు అప్పట్లో సూపర్ స్టార్. గౌతమ్.. సితారలు థర్డ్ జెనరేషన్ కాబట్టి ఆటోమేటిక్ గా నటన వచ్చేస్తుంది. మహేష్ వైపు మాత్రమే కాదు.. అటు నమ్రత వైపుకూడా నటన నేపథ్యం ఉంది. నమ్రత మోడలింగ్ లో పీక్స్ ను చూశారు. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నారు.. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకూ చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఇక నమ్రత ఫ్యామిలీలో కూడా యాక్టర్స్ ఉన్నారు. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ హీరోయిన్ గా నటించారు. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా నటించారు. నమ్రత గ్రాండ్ మదర్ మీనాక్షి శిరోద్కర్ కూడా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. గౌతమ్ సితారలకు ఇలా ఫ్యామిలీలో రెండు వైపులా నటులు ఉన్నారు కాబట్టి యాక్టింగ్ జీన్స్ లోనే ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా!