నమ్రతా శిరోద్కర్ స్టైలిష్ లుక్..

0

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, ఒకప్పటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయారు. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహేష్ బాబు మేనళ్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ముహూర్తపు సన్నివేశానికి హీరో అశోక్, హీరోయిన్ నిధి అగర్వాల్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ కొట్టారు. మరో హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఇక కృష్ణ, గల్లా అరుణకుమారి, జయదేవ్, పద్మావతి కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు అందజేశారు. ఈ వేడుకలో గల్లా కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సుధీర్ బాబు, అమల అక్కినేని, సుశాంత్, వీకే నరేష్‌తో పాటు రాజకీయ ప్రముఖులు ఎంపీ కేశినేని నాని, ఎంపీ రామ్మోహన్ నాయుడు, నన్నపనేని రాజకుమారి, జేసీ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అయితే, ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఆయన బదులు సతీమణి నమ్రతా శిరోద్కర్ విచ్చేశారు. బ్లాక్ మిడీ డ్రెస్‌లో మెరిసిపోయారు. బ్లాక్ మిడీ, బ్లాక్ కలర్ బూట్స్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. 47 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉన్నారు. కాకపోతే, ఆమె సినిమాలను వదిలిపెట్టి చాలా ఏళ్లు అయ్యిందిలెండి. ప్రస్తుతం, మహేష్‌ బాబుకు మంచి భార్యగా.. ఇద్దరు పిల్లల అవసరాలు తీర్చే తల్లిగా ఘట్టమనేని వారి ఇంటి చాలా బాధ్యతతో కూడిన పాత్రను పోషిస్తున్నారు.
Please Read Disclaimer