టాలీవుడ్ ప్రేమ గువ్వలు అబ్బబ్బ

0

అక్కినేని నాగార్జున 60వ బర్త్ డే సెలబ్రేషన్స్ స్పెయిన్ ఇబిజలో సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మామ బర్త్ డే వేడుకలు ఇంత స్పెషల్ గా జరగడానికి కారణం కోడలు సమంత ప్లానింగేనట. సామ్ – చైతన్య జంట పది రోజులు ముందుగానే ఇబిజ లో బీచ్ రిసార్ట్ ని ప్రీబుక్ చేసి ఈనెల 29న కింగ్ బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ ట్రిప్ లో అక్కినేని నాగార్జున- అమల.. నాగచైతన్య- సమంత.. అఖిల్ అందరూ సెలబ్రేషన్ మూడ్ లో కనిపించారు.

ఆన్ ది స్పాట్ నుంచి సామ్ ఇప్పటికే ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలతో పాటు మామ గారి స్విమ్మింగ్ పూల్ సెలబ్రేషన్స్ ని ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల్లోకి షేర్ చేశారు. అది నాగ్ ఫ్యాన్స్ లోకి వైరల్ గా దూసుకెళ్లాయి. తాజాగా సమంత మరో స్పెషల్ ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో హబ్బీ నాగచైతన్యను ప్రేమగా హత్తుకుని ఉన్న ఫోటో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అయితే సేమ్ టు సేమ్ కనిపిస్తున్న మహేష్- నమ్రత జంట ఫోటోతో కలిపి చై- సామ్ ఫోటోని తాజాగా నమ్రత సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు .. ఆ ఫోటోకి సేమ్ టు సేమ్ అంటూ నమ్రత క్యాప్షన్ ఇచ్చారు.

మహేష్ – నమ్రత జంట ప్రేమ వివాహం గురించి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగాక ఈ జోడీ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలయ్యారు. అలాగే నాగచైతన్య- సమంత జోడీ దాదాపు ఏడెనిమిదేళ్ల పాటు సీక్రెట్ ప్రేమాయణం సాగించాక పెళ్లితో ఒకటయ్యారు. ఇద్దరి మధ్యా చాలా విషయాల్లో సారూప్యత కనిపిస్తోంది. కథానాయికల్ని ప్రేమించి పెళ్లాడిన కథానాయకుల జాబితాలో మహేష్.. నాగచైతన్య పేర్లు చేరాయి. ప్రస్తుతం ఈ జంటల ఆదర్శ దాంపత్యం అభిమానులకు స్ఫూర్తినిస్తోంది.



Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home