భర్తను `బేబి` అంటూ లాలిస్తున్న సతీమణి

0

ప్రతి ఫ్యామిలీ లో భార్య భర్తల మధ్య ముద్దు పేర్లు సహజం. భార్య భర్తల బాండింగ్ ను స్ట్రాంగ్ చేసే వాటిలో ఈ ముద్దు పేర్లు కూడా కీరోల్ పోషిస్తాయి. కోపతాపాల్లో ఎలా ఉన్నా ప్రేమ కారిపోతే ఆ ముద్దే వేరు. మరి టాలీవుడ్ ఆదర్శ దంపతులుగా ఉన్న మహేష్ -నమ్రతా శిరోద్కర్ జంట ఇంట్లో ఒకరిని ఒకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా? మహేష్ ని ముద్దుగా బేబి అని పిలుస్తుంటారుట నమ్రత. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వూలో తెలిపారు. కోపం వచ్చినా… ప్రేమ వచ్చినా బేబి అనే పిలుస్తారుట. ఆ పిలుపులో ఎంతో ప్రేమ.. ఆప్యాయత.. అనురాగం ఉంటాయన్నారు.

ప్రతి భార్య భర్త మధ్య ఇలాంటి అండర్ స్టాండింగ్ ఉండాలని నమ్రత అన్నారు. మహేష్ పై ఎప్పుడైనా కోపం వచ్చిన పది నిమిషాల్లో కరిగిపోతానని అన్నారు నమ్రత. “పెళ్లి ముందు ప్రేమించుకున్నాం కాబట్టి ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకోగలిగాం. పెళ్లైన తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్న కలతలు వచ్చినా వాటిని ఇద్దరం వెంటనే మర్చిపోతాం“ అని తెలిపారు.

అలాగే నమ్రతని మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తారని ప్రశ్నిస్తే? హీరోగారు మాత్రం బదులివ్వలేదు. అవన్నీ పర్సనల్ అండీ. పబ్లిక్ చేసేస్తే ఎలా? అంటూ ముసిముసిగా నవ్వేసాడు. మరీ పట్టుబట్టి అడగగా పెళ్లి ముందు ఓ పేరుతో పిలిచేవాడిని. కానీ ఆపేరు ఇప్పుడు గుర్తు కావడంలేదు అంటూ సమాధానం దాటవేశారు మహేష్. పెళ్లి అయ్యి 14 ఏళ్లు అవుతుంది కదా అనీ అన్నారు.

ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించడంతో కొంచెం ఫ్యామిలీ లైఫ్ కూడా మిస్ అవుతున్నా. అప్పుడప్పడు విదేశాలు ట్రిప్ లు వెళ్లినప్పుడు మాత్రం కుటుంబంతో బాగా ఎంజాయ్ చేస్తాను.. అని అన్నారు మహేష్. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన మహేష్ న్యూ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని 14రీల్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారుPlease Read Disclaimer